నోకియా ‘లూమియా 1020’ రూ. 49,999
చెన్నై: నోకియా కంపెనీ 41 మెగా పిక్సెల్ కెమెరా ఫోన్ లూమియా 1020ను శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఫొటోగ్రఫీ అభిరుచి ఉన్నవాళ్లు, ఫొటోగ్రాఫర్లు లక్ష్యంగా ఈ లూమియా 1020ను అందుబాటులోకి తెస్తున్నామని నోకియా ఇండియా డెరైక్టర్(సౌత్) టి.ఎస్. శ్రీధర్ చెప్పారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్ ధరను రూ.49,999గా నిర్ణయించామని పేర్కొన్నారు. నోకియా స్టోర్ నుంచి 800 కోట్ల పాటలను యాక్సెస్ చేసుకోవచ్చని, నోకియా పోర్టల్ నుంచి 1.65 లక్షల యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
11.43 సెం.మీ. డిస్‌ప్లే ఉన్న ఈ ఫోన్‌లో డ్యూయల్ కోర్ 1.5 గిగా హెర్ట్జ్‌క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ఎస్4 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ మాస్ మెమెరీ, 7 జీబీ ఫ్రీ క్లౌడ్ స్టోరేజ్ వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. శుక్రవారం నుంచే విక్రయాలు ప్రారంభించామని, ఆరు నెలల నెలసరి వాయిదాల్లో (ఈఎంఐ)ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చని వివరించారు. ఈ ఏడాది జూన్ నాటికి 2.7 కోట్ల లూమియా రేంజ్ ఫోన్‌లను విక్రయించామని చెప్పారు.