రెండు కిలోల బంగారం స్వాధీనం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: బెంగళూర్- హైదరాబాద్ జాతీయ రహదారిపై మూడు నెలల క్రితం బస్సులో జరిగిన దోపిడీని మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. పట్టుబడిన అంతర్రాష్ట్ర ముఠా నుంచి పోలీసులు రూ.50 లక్షల విలువైన రెం డు కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాలను బుధవారం ఎస్పీ పి.విశ్వప్రసాద్‌తో కలసి హైదరాబాద్ రేంజ్ డీఐజీ గంగాధర్ వెల్లడించారు.
జూన్ 27న వ్యాపారి లోకనాథం తన భార్య సుజారాంతో కలసి కేశినేని ట్రావెల్స్ బస్సులో తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యంలో ప్రయాణికుల కాలకృత్యాలు తీర్చుకునేందుకు బస్సు మానవపాడు మండలం ఇటిక్యాల పాడు జాతీ య రహదారిపై దాబా హోటల్ వద్ద నిలిపింది. బస్సులో సీట్లో ఉంచిన సుమారు ఆరు కిలోల బంగారం ఉన్న పెట్టెను నలుగురు దొంగలు ఉన్న ముఠా బస్సులోకి ప్రవేశించి అపహరిచింది.
ఈ మేరకు వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపిన పోలీసులు బస్సుదోపిడీకి దొంగలు కారును వినియోగించారన్న సమాచారంతో టోల్‌గేట్ల వద్ద వీడియో ఫుటేజీలను పరిశీలించింది. కొంత సమాచారం సేకరించి మధ్యప్రదేశ్‌కు చెందిన దొంగల ముఠాగా గుర్తించారు.
కారుప్లేట్లు మార్చి దోపిడీ
జులై 14న హైదరాబాద్- బెంగళూర్ జాతీయ రహదారి కుల్లూర్ గ్రామశివారులోని టోల్‌ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా (జీజే 01 ఆర్ 2468) కారును తనిఖీ చేయగా అం దులో మూడురకాల నెంబర్ ప్లేట్లు ఉన్నాయి. అందులో ఒకటి దోపిడీ చేసిన రోజువాడిన నెంబర్ ప్లేటు (01 ఎఈ 2462) ఉండటంతో సదరుకారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ మరింత వేగవంతం చేశారు. ఈ దోపిడీకి నలుగురు వ్యక్తులు పాల్పడగా మధ్యప్రదేశ్‌కు చెందిన మహబూబ్‌ఖాన్ తమకు చిక్కాడని తన వాటాగా వచ్చిన రెండు కిలోల బంగారాన్ని హైదరాబాద్‌లో విక్రయించేందుకు వెళ్తుండగా అరెస్ట్ చేసినట్లు డీఐజీ చెప్పారు. మరో ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేయాల్సి ఉందని చెప్పారు.
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
Published Thu, Oct 15 2015 3:18 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement