
ఒబామా దీపావళి విషెస్
దీపావళి సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ఒబామా భారతీయులకు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఆయన ప్రధాని నరేంద్ర మోడీకి స్వయంగా ఫోన్ చేసి.. దీపావళి శుభాకాంక్షలు తెలియజేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొంది.
కాగా... అమెరికా అధ్యక్షుడి నివాసం వైట్ హౌస్ లోనూ దీపావళి సంబరాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. రెండు రోజుల క్రితం వేద మంత్రాల మధ్య.. వైట్ హౌస్ లో దీపావళి ఒబామా పండగ సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన చెడు మీద మంచి సాధించిన విజయమే దీపావళి అని పేర్కొన్నారు.