సీబీసీఎస్ అమలుపై అభ్యంతరాలు! | Objections on CBCS | Sakshi
Sakshi News home page

సీబీసీఎస్ అమలుపై అభ్యంతరాలు!

Published Sun, Apr 26 2015 1:40 AM | Last Updated on Sun, Sep 3 2017 12:52 AM

సీబీసీఎస్ అమలుపై అభ్యంతరాలు!

సీబీసీఎస్ అమలుపై అభ్యంతరాలు!

మార్పులు అవసరమంటున్న విశ్వవిద్యాలయాలు
 యూజీసీ మార్గదర్శకాల కంటే రాష్ట్ర కోర్సుల్లోనే ఎక్కువ చాయిస్
 రెండు భాషల విధానం కొనసాగించాల్సిందే
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో డి గ్రీ, పీజీ కోర్సుల్లో చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్) అమలుకు సిద్ధమేనని, అయితే యూనివర్సిటీ గ్రాం ట్స్ కమిషన్ (యూజీసీ) ప్రతిపాదించిన మోడల్ సిలబస్‌పై అభ్యంతరాలున్నాయని తెలంగాణలోని విశ్వవిద్యాలయాల డీన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సీబీసీఎస్ అమలుపై వివిధ విశ్వ విద్యాలయాల డీన్స్‌తో ఉన్నత విద్యామండలి శుక్రవారం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో సీబీసీఎస్ అమలుపై విసృ్తతంగా చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆ నిర్ణయాలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి శనివారం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కు  పంపించింది.
 
 సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివే..
 పాఠ్య ప్రణాళికను నిర్ణయించడంలో వర్సిటీలకున్న స్వేచ్ఛను కొనసాగించాలని కోరారు.అభ్యసన లక్ష్యాలు, అభ్యసన ఫలితాలను యూజీసీ నిర్దేశించవచ్చని, డిగ్రీ కోర్సులకు మొత్తం క్రెడిట్స్ సంఖ్యను యూజీసీ నిర్ణయించవచ్చని పేర్కొన్నారు. ఉమ్మడి సిలబస్‌ను నిర్ణయించిన యూజీసీ, 20 శాతం మాత్రమే సిల బస్‌ను మార్చుకునే అవకాశం రాష్ట్రాలకు ఇవ్వడం ఆమోదయోగ్యం కాదన్నారు.
 మొత్తం కోర్సులో ప్రధాన సబ్జెక్టులు కనీసం 60 శాతం ఉండాలని, మిగతా దాంట్లో యూజీసీ పేర్కొన్నట్లు కాకుండా ప్రాంతీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని వర్సిటీలు రూపొందించే ఎలక్టివ్ సబ్జెక్టులు, ఫౌండేషన్ కోర్సులు ఉండాలని పేర్నొన్నారు.
 తెలంగాణలోని డిగ్రీ పాఠ్య ప్రణాళిక.. తదుపరి కోర్సులు చదవడానికి ఎక్కువ అనుకూలంగా ఉందని, యూజీసీ ప్రకటించిన మోడల్ పాఠ్య ప్రణాళిక కంటే రాష్ట్ర పాఠ్య ప్రణాళికలోనే ఎక్కువ చాయిస్ ఉందని అభిప్రాయపడ్డారు.
 ఫౌండేషన్ కోర్సు కింద మొత్తం ఐదు సబ్జెక్టుల్లో పీజీకి అవకాశం ఉందని వివరించారు.  సీబీసీఎస్ విధానంలో ఇచ్చే క్రెడిట్స్‌కు ఇది సమానంగా ఉందని స్పష్టం చేశారు.
 యూజీసీ ప్రతిపాదించిన సీబీసీఎస్‌ను (మాడ్యులర్ మోడల్) సవరించాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన క్రెడిట్స్‌ను సాధారణీకరించాలని పేర్కొన్నారు.
 రాష్ట్రంలో డిగ్రీలోని ఇంగ్లిష్, తెలుగు వంటి ప్రథమ ద్వితీయ భాషలను కొనసాగించాలని అభిప్రాయ పడ్డారు. హిందీ లేదా ఇంగ్లిష్ మాత్రమే చదువుకోవాలని పేర్కొనడం సరైంది కాదన్న వాదన వ్యక్తమైంది.  
 మరోవైపు భాషను కోర్సు మొత్తంలో ఒకే పేపరుగా పెట్టడం కాకుండా రె ండు పేపర్లుగా పెట్టి ఒక్కో దానికి 12 క్రెడిట్స్ చొప్పున 24 క్రెడిట్స్ కేటాయించాలని పేర్కొన్నారు.
 యూజీసీ 2014 నవంబర్‌లో ఇచ్చిన మోడల్ పాఠ్య ప్రణాళికకు ప్రస్తుతం ఇచ్చిన మార్గదర్శకాలకు మధ్య వైరుధ్యం ఉందన్నారు. రెండు  విరుద్ధంగా ఉన్నాయన్నారు. యూజీసీ 2014లో ప్రకటించిన మార్గదర్శకాలే రాష్ట్రం లో ప్రస్తుతం అమల్లో ఉన్న విధానానికి మెరుగులు దిద్దేవిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
 నెట్‌లాంటి పరీక్షల కోసం యూజీసీ సూచించిన కోర్సులకు సంబంధించిన విభాగాలకు (స్ట్రీమ్) అనుగుణంగా సబ్జెక్టుల విభజన జరగాలని పేర్కొన్నారు.
 వారానికి (పని దినాల్లో) గరిష్ట బోధన సమయాన్ని నిర్ణయించాల్సి ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement