ఎమ్మెల్యే శ్రీకాంత్ సోరెన్
ఓ మహిళపై అధికార పార్టీ ఎమ్మెల్యే అత్యాచారం జరిపిన సంఘటన ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా పోలీసుల కథనం ప్రకారం... ఉదాల పట్టణంలోని స్థానిక మహిళ తనకు ఉద్యోగం కావాలంటూ బీజు జనతాదళ్ ఎమ్మెల్యే శ్రీనాథ్ సోరెన్ను అశ్రయించింది. అందులోభాగంగా ముందుగా రూ. లక్ష నగదు ఆయనకు అందజేసింది. అయితే ఉద్యోగం కోసం ఎమ్మెల్యే వద్దకు ఎన్నిసార్లు వెళ్లిన మరోసారి రమ్మని ఆయన చెప్పడంతో సదరు మహిళ విసిగిపోయింది.
దాంతో తాను ఇచ్చిన నగదు మొత్తాన్ని తిరిగి ఇచ్చి వేయాలని ఎమ్మెల్యేను మహిళ డిమాండ్ చేసింది. దాంతో జనవరి 3వ తేదీన తప్పక ఇస్తాని, తాను చెప్పిన చోటకు రమ్మని ఆమెను నమ్మబలికాడు. దాంతో అమాయకరాలైన మహిళ శ్రీనాథ్ సోరెన్ మాటలను నమ్మింది. జనవరి 3వ ఎమ్మెల్యే చెప్పిన చోటుకు వెళ్లింది. ఎమ్మెల్యేను డబ్బును అడగగా ఎమ్మెల్యేతోపాటు అతడి సహయకుడు ఇద్దరు కలసి ఆ మహిళపై అత్యాచారం జరిపారు.
దాంతో మహిళ సమీపంలోని పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసిన వారు స్పందించకపోవడంతో ఆ మహిళ కోర్టును ఆశ్రయించింది. దీంతో సదరు ఎమ్మెల్యే, అతడి సహయకుడిని అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. దాంతో వారిద్దరిపై సోమవారం సాయంత్రం కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. నివేదిక రావలసి ఉందని తెలిపారు. అయితే తనపై మహిళ అత్యాచార ఆరోపణలు ప్రతిపక్షల కుట్ర అని ఎమ్మెల్యే శ్రీనాథ్ సోరెన్ ఆరోపించారు. తన వ్యక్తిగత ప్రతిష్టను భగ్నం చేసేందుకు విపక్షాల అడిన ఆటలో తాను పావుని చేశారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.