!['కల్బర్గీ హత్యకు పాతకక్షలే కారణం'](/styles/webp/s3/article_images/2017/09/3/81446564902_625x300.jpg.webp?itok=Xyoo5VT6)
'కల్బర్గీ హత్యకు పాతకక్షలే కారణం'
బెంగళూరు: ప్రముఖ హేతువాద నాయకుడు, అభ్యుదయవాది కల్బర్గీ హత్యకు పాతకక్షలే కారణమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య చెప్పారు. ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.
77 ఏళ్ల కల్బర్గీని ధార్వాడ్‌లోని ఆయన ఇంటివద్ద ఇటీవల ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఇటీవల హత్యకు గురైన మహారాష్ట్ర హేతువాది గోవింద్ పన్సారేకు కల్బర్గీ సహచరుడు.