5న టీ-హబ్ ప్రారంభం | On 5th Nov T-Hub Launch | Sakshi
Sakshi News home page

5న టీ-హబ్ ప్రారంభం

Published Fri, Oct 30 2015 3:00 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

5న టీ-హబ్ ప్రారంభం - Sakshi

5న టీ-హబ్ ప్రారంభం

బిజినెస్ సొల్యూషన్స్ సదస్సులో మంత్రి కేటీఆర్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్/బెంగళూరు: ఔత్సాహిక పారిశ్రామిక వేత్త (స్టార్టప్)లను ప్రోత్సహించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ-హబ్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ‘ఆలోచనలతో రండి.. ఆవిష్కరణలతో వెళ్లండి’ అనే నినాదంతో ఏర్పాటు చేసిన టి-హబ్‌ను నవంబర్ 5న టాటా గ్రూప్ సంస్థల మాజీ చైర్మన్ రతన్ టాటా చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు.

గురువారం బెంగళూరులో‘డిస్కవర్ బిజినెస్ సొల్యూషన్స్’ అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఐటీ ప్రో త్సాహకానికి ప్రభుత్వ ప్రాధాన్యతను వివ రించారు. ఐటీ రంగంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా ఇన్నోవేట్-ఇంక్యుబే ట్-ఇన్‌కార్పెట్ నినాదంతో ముందుకెళ్తున్నా మన్నారు. కాగా, అంతర్జాతీయ వస్తు ప్రద ర్శన కేంద్రంలో సీ-బిట్ పేరుతో ఎలక్ట్రానిక్ ఉపకరణాల ప్రదర్శనను ప్రారంభించిన కేటీఆర్...సమాచార, సాంకేతిక రంగం తోపాటు డిజిటైజేషన్‌లో కర్ణాటకకు తాము గట్టి పోటీ ఇవ్వనున్నట్లు చెప్పారు.
 
బయోకాన్ చైర్‌పర్సన్‌తో భేటీ
‘బయోకాన్’ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షాను మంత్రి కేటీఆర్ గురువారం బెంగళూ రులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భం గా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయ నున్న ఫార్మాసిటీ, టీ-హబ్‌ల ద్వా రా పరిశ్ర మల స్థాపనకు ఉన్న అవకాశాలపై చర్చించారు. పెట్టుబడిదారు లు వ్యాపారాన్ని సులువుగా నిర్వహిం చుకు నేందుకు ప్రభు త్వం చేపట్టాల్సిన చర్యలపై మజుందార్ కేటీఆర్‌కు సూచనలు చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement