ప్రాణం తీసిన అగ్గిపెట్టె.. | One Person murder attack the another person | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన అగ్గిపెట్టె..

Published Mon, May 8 2017 7:09 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ప్రాణం తీసిన అగ్గిపెట్టె.. - Sakshi

ప్రాణం తీసిన అగ్గిపెట్టె..

బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): అగ్గిపెట్టె అడిగితే లేదన్నందుకు పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని ఓ యువకుడు దారుణహత్యకు పాల్పడ్డాడు. జూబ్లీహిల్స్‌ ఎస్సై మక్సూద్‌అలీ తెలిపిన వివరాలివీ.. ఎస్పీఆర్‌ హిల్స్‌ క్వారీ సమీపంలో  బోరబండకు చెందిన ఆమెర్‌ఖాన్‌(22), సొహైల్, షారూఖ్‌లు కలిసి ఆదివారం రాత్రి మద్యం తాగుతున్నారు. వారికి సమీపంలోనే నరేందర్‌ అనే యువకుడితో పాటు మరో నలుగురు స్నేహితులు మద్యం తాగుతున్నారు. అ సమయంలో నరేందర్‌ సిగరెట్‌ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టె కావాలంటూ ఆమెర్‌ను అడిగాడు. 
 
తాను సిగరెట్‌ తాగనని తెలుసుకదా అగ్గిపెట్టె ఎలా ఉంటుందని జవాబిచ్చాడు. కొద్దిసేపటి తర్వాత ఆమెర్‌తో పాటు స్నేహితులు బైక్‌పై వెళ్తుండగా నరేందర్‌ ఆమెర్‌ను రమ్మని పిలిచాడు. దీంతో ఆమేర్‌ మద్యం తాగుతున్న వారి వద్దకు వెళ్లాడు. పది నిమిషాల తర్వాత పెద్దగా కేకలు వినిపించడంతో సొహైల్‌ వెళ్లాడు. అతడు చూస్తుండగానే కత్తిపోట్లతో ఆమెర్‌ పడిపోయి ఉన్నాడు. నరేందర్‌ పారిపోతూ సొహైల్‌పై కూడా రాళ్లతో దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. మృతుడి శరీరంపై 15 వరకు కత్తిపోట్లు గుర్తించారు. నరేందర్‌తోపాటు అతని స్నేహితుల కోసం గాలింపు చేపట్టారు. పాత కక్షల నేపథ్యంలోనే పథకం ప్రకారం ఈ దాడి జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement