పాక్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కమిషన్ షాక్
పాక్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కమిషన్ షాక్
Published Fri, Dec 16 2016 4:18 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
న్యూఢిల్లీ: నిషేధించిన టెర్రరిస్టు గ్రూపులతో సంబంధాలను కలిగివుండటంపై ఆ దేశ సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిషన్ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని విమర్శించింది. ఈ మేరకు పాక్ జాతీయ మీడియాలో పలు కథనాలు వెలువడ్డాయి. క్వెట్టాలో బాంబు దాడుల తర్వాత విచారణకు పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఓ కమిషన్ ను నియమించింది. దాడులపై విచారణ జరిపిన కమిషన్ బృందం 110 పేజీల రిపోర్టును పాక్ అత్యున్నత న్యాయస్ధానానికి అందించింది. రిపోర్టుల్లో పాకిస్తాన్ ప్రభుత్వ వక్రబుద్ధిని ఎండగట్టింది.
యాంటీ టెర్రరిజం యాక్టు(ఏటీఏ)ను కేవలం మాటల్లో కాకుండా.. ఆచరణలో పెట్టాలని సూచించింది. దీంతో భారత్ లాంటి దేశాలు పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోందని పేర్కొంటున్న వ్యాఖ్యలు నిజమేనని వెల్లడైంది. ఒకవేళ పాకిస్తాన్ మిలటరీ వ్యవస్ధను అనుసరించాలనుకుంటే రాజ్యాంగంలో మార్పులు చేయాలని పేర్కొంది.
నిషేధించిన సంస్ధలైన సిఫా-ఐ-సహబా పాకిస్తాన్, మిలత్-ఐ-ఇస్లామియా, అహ్లే సున్నత్ వాల్ జమాత్ లకు పాకిస్తాన్ హోం శాఖ మంత్రి హెడ్ గా ఉండటంతో ఆయన్ను కలవడానికి కమిషన్ తిరస్కరించింది. ఏటీఏను దేశం మొత్తం పాటించాలని కమిషన్ కోరింది. నిషేధిత జాబితాలో ఉన్న సంస్ధల గురించి ప్రతి ఒక్కరికి తెలియాలని అంది. టెర్రరిస్టు ఆర్గనైజేషన్లు సమావేశాలను నిర్వహించకుండా అడ్డుకోవాలని చెప్పింది.
Advertisement
Advertisement