ప్రధాని మోదీ హత్యకు భారీ కుట్ర | ‘Pakistan mystery caller’ offers Rs 50 crore to man for killing PM Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ హత్యకు భారీ కుట్ర

Published Tue, May 23 2017 11:14 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

ప్రధాని మోదీ హత్యకు భారీ కుట్ర - Sakshi

ప్రధాని మోదీ హత్యకు భారీ కుట్ర

- సహకరిస్తే రూ.50కోట్లు ఇస్తా.. పాక్‌ అగంతకుడి ఫోన్‌కాల్‌

భోపాల్‌:
‘భారత ప్రధాని నరేంద్ర మోదీని అంతం చేయడానికి పథకం రెడీగా ఉంది. త్వరలోనే ఆయన ముంబైలో ఓ ర్యాలీలో పాల్గొంటారు.. అదనుచూసి దాడిచేద్దాం..’ అంటూ ఓ అగంతకుడు చేసిన ఫోన్‌కాల్‌ కలకలం రేపుతోంది. తాను పాకిస్థాన్‌ నుంచి మాట్లాడుతున్నానని, మోదీ హత్యకు సహకరిస్తే రూ.50కోట్లు ఇస్తానని ఆగంతకుడు చెప్పాడు. అసలేం జరిగిందంటే..

మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లా కేంద్రానికి చెందిన కుషాల్‌ సోనీకి ఇటీవలే +79651219 నంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది. తననుతాను పాకిస్థానీగా పరిచయం చేసుకున్న అగంతకుడు.. మోదీని హత్యకు సహకరించాలని కుషాల్‌ను అడిగాడు. కంగారుపడుతూనే కాల్‌ను రికార్డ్‌ చేసిన కుషాల్‌.. నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్లాడు. ఈ వ్యవహారంపై సాత్నా జిల్లా ఎస్పీ మిత్‌లేశ్‌కుమార్ స్పందించారు. కుషాల్‌ అందించిన నంబర్‌ను పరిశీలించామని, అయితే అది పాకస్థాన్‌నుంచి వచ్చిందికాదని, కజకిస్థాన్‌ నుంచి వచ్చిందని చెప్పారు. కాల్ రికార్డింగ్‌ను పరిశీలిస్తున్నామన్న ఆయన.. ఇది ఆకతాయిలపనా? లేక మరొకటా అనేదానిపై విచారణ చేపట్టామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement