ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో బాలికల విద్యా హక్కుల కోసం ఉద్యమిస్తున్న బాలిక మలాలా యూసఫ్‌జాయ్ మతంపై నమ్మకంలేని వాళ్ల ఏజెంటు అని గతంలో ఆమెపై తుపాకీ కాల్పులతో దాడికి పాల్పడిన తాలిబన్లు విమర్శించారు. ఆమెకు నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించటాన్ని పాక్ తాలిబన్ వేర్పాటు వర్గం జమాత్ ఉల్ అహ్రార్ తప్పుపట్టింది. ‘తుపాకులు, సాయుధ సంఘర్షణలకు వ్యతిరేకంగా మలాలా చాలా మాట్లాడుతోంది. పేలుడు పదార్థాలను కనుగొన్నది.. ఆమెకు ప్రకటించిన నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడేనన్న విషయం ఆమెకు తెలియదా?’ అని జమాత్ ఉల్ అహ్రార్ ప్రతినిధి ఎహ్‌సానుల్లా ఎహ్‌సాన్ అన్నాడు.
‘గౌరవం కోసం కృషి చేసే వారి విజయం’
వాషింగ్టన్: భారత సామాజిక కార్యకర్త కైలాశ్ సత్యార్థి, మలాలాకు సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించటం.. ప్రతి ఒక్క మానవుని గౌరవాన్ని నిలబెట్టేందుకు కృషిచేస్తున్న వారందరి విజయమని అమెరికా అధ్యక్షుడుఒబామా అభివర్ణించారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన ఆయన.. ఈ ఏడాది ఆ అవార్డు విజేతలకు ఓ సందేశంలో అభినందించారు. బాల కార్మికతను నిర్మూలించేందుకు, ప్రపంచం నుంచి బానిసత్వమనే కళంకాన్ని తుడిచివేసేందుకు కైలాశ్ సత్యార్థి తన జీవితాన్ని అంకితం చేశారు’ అని కొనియాడారు.
మలాలాకు నోబెల్‌పై తాలిబ న్ల ధ్వజం
Published Sun, Oct 12 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM
Advertisement