న్యూఢిల్లీ: లాభదాయకమైన జాతీయ జలమార్గాలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలన్న నౌకాయాన మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను పార్లమెంటరీ స్థాయీ సంఘం వ్యతిరేకించింది. నాలుగు, ఐదో జాతీయ జలమార్గాలను పీపీపీ పద్ధతిలో అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఈ మేరకు రవాణా, పర్యాటకం, సాంస్కృతిక అంశాలపై నియమితమైన పార్లమెంటరీ సంఘం పార్లమెంటుకు నివేదిక సమర్పించింది.
లాభదాయకమైన మార్గాలనే ప్రైవేటుకు అప్పగించాలన్న ఈ ప్రతిపాదనను సీతారాం ఏచూరి నేతృత్వంలోని కమిటీ ప్రశ్నించింది. కాగా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిని కలుపుతూ గోదావరి, కృష్ణా నదులతోకూడిన మార్గాన్ని నాలు గో జాతీయ జలమార్గంగా, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ను కలుపుతూ ఉన్న మార్గా న్ని ఐదో జాతీయ జలమార్గంగా 2008లో ప్రకటించగా.. ఇంకా రవాణా కార్యకలాపాలు ప్రారంభం కాలేదు.