పనిమనిషితో భర్త గుట్టు విప్పిన చిలుక! | parrot exposes husband affair with housemaid | Sakshi
Sakshi News home page

పనిమనిషితో భర్త గుట్టు విప్పిన చిలుక!

Published Thu, Oct 27 2016 10:17 AM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

పనిమనిషితో భర్త గుట్టు విప్పిన చిలుక!

పనిమనిషితో భర్త గుట్టు విప్పిన చిలుక!

మాటలు నేర్చిన రామచిలుక ఇంట్లో ఉంటే ఆ ఆనందమే వేరు. మనం మాట్లాడిన మాటల్నే ముద్దుముద్దుగా అది వల్లేవేస్తుంది. కానీ, ఓ రామచిలుక మాత్రం తాను నేర్చిన మాటలతో తన ఇంటి ఆసామి బండారం బట్టబయలు చేసింది. పనిమనిషితో రహస్యంగా శృంగారలీలలు జరుపుతూ.. ఆమెతో ఆయన చెప్పిన ముద్దుముద్దు మాటల్ని ఆ చిలుక భార్య ముందు పలికేసింది. దాంతో పనిమనిషితో ఆయన జరుపుతున్న రహస్య రాసలీలలు బట్టబయలయ్యాయి. దీంతో ఇప్పుడాయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ ఘటన కువైట్‌లో జరిగింది. పనిమనిషితో భర్త రహస్యంగా జరుపుతున్న రాసలీలల గురించి పెంపుడు చిలుక గుట్టువిప్పడంతో భార్య ఆయన మీద కేసు పెట్టింది. వారిద్దరి రహస్యంగా మాట్లాడుకున్న మాటల్ని చిలుక పదేపదే వల్లే వేయడంతో వారిపై తనకు అనుమానం కలిగినట్టు హవాల్లి పోలీసు స్టేషన్‌లో చేసిన ఫిర్యాదులో పేర్కొంది. భర్త తనను మోసం చేస్తున్నాడని తనకు చాలాకాలంగా అనుమానంగా ఉందని, చిలుక మాటలతో ఈ అనుమానం నిజమైందని తెలిపింది. తాను ఆఫీసు నుంచి త్వరగా వస్తే భర్త ఆశ్చర్యపోతున్నాడని, కుంగిపోయి కనిపిస్తున్నాడని ఆమె పేర్కొంది. అయితే, చిలుక చెప్పిన విషయాల ఆధారంగా కేసు నమోదుచేయలేమని పోలీసులు అంటున్నారు. టీవీలో రాసలీలల దృశ్యాలు చూసి.. ఆ మాటల్ని చిలుక వల్లేవేస్తూ ఉండవచ్చునని, చిలుక మాటల ఆధారంగా నేరాన్ని నిరూపించడం కష్టమని పోలీసులు అంటున్నారని అరబ్‌ టైమ్స్‌ పత్రిక  ఓ కథనంలో పేర్కొంది. గల్ఫ్‌ దేశాల్లో అక్రమ సంబంధం కలిగి ఉండటం నేరం. ఈ నేరం రుజువైతే కఠినమైన జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement