బీమా ఏజెంట్ల నియామకానికి ఐఆర్‌డీఏ పరీక్ష పాసవ్వాల్సిందే.. | Pass exam to become agent: IRDA | Sakshi
Sakshi News home page

బీమా ఏజెంట్ల నియామకానికి ఐఆర్‌డీఏ పరీక్ష పాసవ్వాల్సిందే..

Published Fri, Apr 3 2015 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 11:45 PM

బీమా ఏజెంట్ల నియామకానికి ఐఆర్‌డీఏ పరీక్ష పాసవ్వాల్సిందే..

బీమా ఏజెంట్ల నియామకానికి ఐఆర్‌డీఏ పరీక్ష పాసవ్వాల్సిందే..

 న్యూఢిల్లీ: ఇన్సూరెన్స్ ఏజెంట్ కావాలంటే తాము నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత తప్పనిసరి అని ఇన్సూరెన్స్ రంగ నియంత్రణ సంస్థ, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ, డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఏ) తెలిపింది. ఈ పరీక్షలో లైఫ్, జనరల్, ఆరోగ్య బీమాలకు సంబంధించిన సబ్జెక్ట్‌లు ఉంటాయని, అలాగే ఇన్సూరెన్స్ ఏజెంట్ నియామకానికి కొత్తగా రూపొందించిన నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. కేవలం ఆరోగ్య బీమా కంపెనీలు ఇన్సూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఐఐఐ) పరీక్షల నమూనా ఆధారంగానే జూన్ 30 వరకు ఏజెంట్లను నియమించుకోవచ్చని తర్వాత ఆ కంపెనీలు కూడా ఐఆర్‌డీఏఐ నియమావళిని అనుసరించాల్సి ఉంటుందని తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement