తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్.. పెషావర్ దాడితో ఉలిక్కిపడింది.
ఇస్లామాబాద్: తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్.. పెషావర్ దాడితో ఉలిక్కిపడింది. తాము ఊతమిచ్చిన కిరాతక దాడికి పాల్పడడంతో పాక్ పాలకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఊహించనివిధంగా ఉగ్రదాడి జరగడంతో దిద్దుబాటు చర్యలకు దిగారు. తీవ్రవాదాన్ని తుదముట్టించాలని సంకల్పం చెప్పుకున్నారు.
పెషావర్ లోని ఆర్మీ పాఠశాలపై మంగళవారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో 133 మంది విద్యార్థులు, 9 మంది టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. 200 మందిపైగా గాయపడ్డారు. దీంతో ఉలిక్కిపడిన పాకిస్థాన్ తీవ్రవాదాన్ని అంతమొందిచాలంటూ జాతికి పిలుపునిచ్చింది. ఇలాంటి సమయంలో జాతియావత్తు చేతులు కలిపి మన భూభాగం నుంచి తీవ్రవాదాన్ని తరిమికొట్టేందుకు నడుంబిగించాలని పేర్కొంది. పాకిస్థాన్ విదేశాంగ కార్యాలయం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.