పాకిస్థాన్: పెషావర్ ఘటనతో తీవ్రవాదులపై ప్రతీకార చర్యలకు నడుంబిగించిన పాకిస్థాన్ ప్రభుత్వం అందుకు అనుగుణంగా తన కసరత్తులను తీవ్రతరం చేసింది. దీనిలో భాగంగా ఆరుగురు తీవ్రవాదులను ఉరితీసేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం సిద్ధమైంది. ఆ తీవ్రవాదులను ఉరితీయడానికి ఆర్మీ చీఫ్ రహీల్ క్లియరెన్స్ ఇవ్వడంతో వారిని ఏ క్షణానైనా ఉరి తీసే అవకాశం ఉంది. ముందుగా ఇద్దరు తీవ్రవాదులను ఉరి తీసేందుకు ఏర్పాట్లు చేశారు. పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ పై దాడికి యత్నించిన ఘటనలో వారిని ఉరి తీయనున్నారు.
మంగళవారం ప్రతీకార పొరలతో కళ్లు మూసుకొనిపోయిన తాలిబన్ రక్కసిమూక పాక్‌లోని ఓ సైనిక పాఠశాలపై ఒక్కసారిగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. తరగతి గదుల్లో ప్రశాంతంగా పరీక్ష రాసుకుంటున్న విద్యార్థులపై విచక్షణారహితంగా బుల్లెట్ల వర్షం కురిపించి 141 మంది ప్రాణాలను బలితీసుకున్నారు. దీంతో ఉలిక్కిపడిన పాక్ ప్రభుత్వం తీవ్రవాదులపై కఠిన చర్యలకు రంగం సిద్ధం చేసింది.