పాకెట్‌లో ప్రింటర్.. | pocket printer | Sakshi
Sakshi News home page

పాకెట్‌లో ప్రింటర్..

Published Sun, Apr 13 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 5:56 AM

పాకెట్‌లో ప్రింటర్..

పాకెట్‌లో ప్రింటర్..

మొబైళ్లు, కంప్యూటర్లు ఇలా వీటిల్లో అన్నీ మినీ మోడళ్లు.. కొత్త కొత్త సదుపాయాలు వచ్చేస్తున్నాయి. ప్రింటర్ల విషయానికొచ్చేసరికి అలాంటివి తక్కువే. ఆ ఆలోచనతోనే ఇజ్రాయెల్‌కు చెందిన జుటా ల్యాబ్స్ మన పాకెట్‌లో పట్టేసే ప్రింటర్‌ను తయారుచేసింది. అంటే.. మనకు బయట ఎక్కడో సడన్‌గా ఓ పేజీ ప్రింట్ కావాలి. ప్రింటర్ల కోసం వెతుక్కోవాల్సిన పనిలేదు. ఈ వైర్‌లెస్ ప్రింటర్ ను బయటకు తీసి.. ప్రింట్ చేసేయొచ్చు. దీన్ని స్మార్ట్‌ఫోన్ లేదా పీసీకు బ్లూటూత్ ద్వారా అనుసంధానించి.. పనిచేయించొచ్చు. నాలుగు అంగుళాల ఎత్తు, నాలుగు అంగుళాల వ్యాసమున్న ఈ బుల్లి ప్రింటర్ ఒక నిమిషంలో 1.2 పేజీలు ప్రింట్ చేస్తుంది. వచ్చే ఏడాది జనవరిలో ఇది మార్కెట్లోకి రానుంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement