నేలకు చేరువగా నెలరాజు.. 31న కనిపించనున్న దృశ్యం
31న కనిపించనున్న దృశ్యం ఈ నెలలో ఇది రెండోసారి
బెంగళూరు: నేలకు చేరువగా శుక్రవారం రాత్రి నెలరాజు కనువిందు చేయనున్నాడు. చంద్రుడు తన కక్ష్యలో భూమికి చేరువగా వచ్చే సమయంలో అరుదుగా ఇలా కనిపిస్తాడు. అయితే, జనవరి నెలలోనే వరుసగా రెండోసారి ఇలా కనిపించనుండటం విశేషం. జనవరి 1న కూడా చందమామ భూమికి చేరువగా కనువిందు చేశాడు. ఈ ఏడాది మరో మూడుసార్లు... జూలై 12, ఆగస్టు 10, సెప్టెంబర్ 9 తేదీల్లో చంద్రుడు భూమికి చేరువగా కనిపించనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడు తన కక్ష్యలో భూమికి చేరువగా వచ్చే సమయంలో సాధారణం కంటే 14 శాతం ఎక్కువ పెద్దగా, 30 శాతం ఎక్కువ వెలుగుతో కనిపిస్తాడని స్పేస్ ఫౌండేషన్ అధ్యక్షుడు సీబీ దేవ్‌గణ్ చెప్పారు. ఇలా కనిపించే చంద్రుడికి 1979లో ఖగోళ శాస్త్రవేత్త రిచర్డ్ నోలే ‘సూపర్‌మూన్’గా నామకరణం చేసినట్లు వివరించారు.