పార్లమెంట్ వద్ద మహిళల నిరసన | Protest outside Parliament over Women's Reservation Bill | Sakshi
Sakshi News home page

పార్లమెంట్ వద్ద మహిళల నిరసన

Published Fri, Feb 21 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM

Protest outside Parliament over Women's Reservation Bill

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలను పొడిగించైనా చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తూ గురువారం పార్లమెంట్ బయట కొంతమంది మహిళలు ప్రదర్శన నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకొచ్చిన వారు 144 సెక్షన్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో నినాదాలిచ్చారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే కీలక బిల్లుల ఆమోదం కోసం పార్లమెంట్ సమావేశాలు పొడిగించే అవకాశం ఉందని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ అంతకుముందే ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement