భారత్‌కు ఆ హక్కు లేదు: పాకిస్తాన్‌ | 'Provocative Statements' By India Will Vitiate Environment, Says Pak's Nafees Zakaria | Sakshi

భారత్‌కు ఆ హక్కు లేదు: పాకిస్తాన్‌

Published Fri, May 5 2017 9:20 AM | Last Updated on Sat, Mar 23 2019 8:44 PM

భారత్‌కు ఆ హక్కు లేదు: పాకిస్తాన్‌ - Sakshi

భారత్‌కు ఆ హక్కు లేదు: పాకిస్తాన్‌

భారత్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రస్తుతం ఇరుదేశాల మధ్య నెలకొన్న ‘వాతావరణం’ మరింత దెబ్బతింటుందని పాకిస్తాన్‌ పేర్కొంది.

ఇస్లామాబాద్‌: భారత్‌ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రస్తుతం ఇరుదేశాల మధ్య నెలకొన్న ‘వాతావరణం’ మరింత దెబ్బతింటుందని పాకిస్తాన్‌ పేర్కొంది. తమ సైనికుల తలలను పాకిస్తాన్‌ సైన్యమే నరికిందంటూ భారత్‌ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసింది. రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన విమర్శలపై పాక్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నఫీస్‌ జకారియా ‘రేడియో పాకిస్తాన్‌’తో మాట్లాడుతూ, భారత సైనికుల తలలు నరికిన ఘటనంటూ ఏదీ జరగలేదని తాము ఇప్పటికే స్పష్టం చేశామని తెలిపారు.

తమపై చేస్తున్న ఆరోపణలను ఐక్యరాజ్యసమితి ముందు పెట్టే హక్కును భారత్‌ ఎప్పుడో కోల్పోయిందని, యూఎన్‌కు భారత్‌ ఎప్పడూ కట్టుబడి ఉండలేదని ఆరోపించారు. యూఎన్‌ మిలిటరీ అబ్జర్వర్స్‌ గ్రూప్‌నకు భారత్‌ ఎన్నడూ సహకరించలేదన్నారు. కశ్మీర్‌లో జరుగుతున్న దురాగతాల నుంచి ప్రపంచ దృష్టిని మళ్లించేందుకు భారత్‌ ప్రతిసారి ‘పాకిస్తాన్‌ కార్డ్‌’ను వాడుకుంటోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement