ఆడెన్: ఆగ్నేయ యెమెన్ లో అల్-ఖయిదా తీవ్రవాదులు జైలుపై దాడి చేసి 300 మందిని విడుపించుకుపోయారు. వీరిలో అల్-ఖయిదా నాయకుడొకరు ఉన్నారని జైలు అధికారి ఒకరు వెల్లడించారు. హద్రామావత్ ప్రావిన్స్ లోని జైలులపై దాడి చేసిన తీవ్రవాదులు ఇద్దరు జైలు గార్డులను చంపేశారు. ఈ సందర్భంగా జరిగిన దాడిలో ఐదుగురు ఖైదీలు మృతి చెందారు.
నాలుగేళ్లుగా జైల్లో ఉన్న అల్-ఖయిదా అరబియన్ ద్వీపకల్పం(ఏక్యూఏపీ) టాప్ కమాండర్ ఖలీద్ బాతార్ఫీ ను తీవ్రవాదులు విడిపించుకుపోయారు. 2011-12లో యెమెన్ ప్రభుత్వంతో అల్-ఖయిదా తీవ్రవాదులు జరిపిన ఖలీద్ పోరాటంలో కీలకపాత్ర పోషించాడు.
యెమెన్ జైలుపై అల్-ఖయిదా దాడి
Published Thu, Apr 2 2015 3:35 PM | Last Updated on Fri, Aug 17 2018 7:36 PM
Advertisement
Advertisement