రాహుల్ వెళ్లింది ఎక్కడికి? | Rahul gandhi told to be gone to bangkok | Sakshi
Sakshi News home page

రాహుల్ వెళ్లింది ఎక్కడికి?

Published Fri, Apr 17 2015 9:04 AM | Last Updated on Sun, Sep 3 2017 12:25 AM

రాహుల్ వెళ్లింది ఎక్కడికి?

రాహుల్ వెళ్లింది ఎక్కడికి?

కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏకంగా 57 రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా అదృశ్యం అయిపోయి ఎట్టకేలకు తిరిగి వచ్చారు. ఢిల్లీ వచ్చిన తర్వాత కూడా ఆయన ఎక్కడా బయటకు రాలేదు. ఆయన తల్లి సోనియాగాంధీయే స్వయంగా రాహుల్ ఇంటికి వెళ్లి చూసి వచ్చారు. అయితే ఇన్నాళ్లూ రాహుల్ గాంధీ ఎక్కడకి వెళ్లారు.. ఏం చేశారన్న విషయం మాత్రం ఇంతవరకు ఎవరికీ స్పష్టంగా తెలియలేదు. అయితే ఆయన ప్రయాణించారని చెబుతున్న ఓ విమాన టికెట్ మాత్రం సంచలనం సృష్టిస్తూ నెట్ ప్రపంచంలో చక్కర్లు కొడుతోంది. అందులో వివరాలను బట్టి చూస్తే మాత్రం ఆయన ఫిబ్రవరి 16వ తేదీన బ్యాంకాక్ వెళ్లి, ఏప్రిల్ 16వ తేదీన అదే బ్యాంకాక్ నుంచి తిరిగి వచ్చినట్లు ఉంది. 'రాహుల్ఎంఆర్ గాంధీ' అనే పేరు మీద ఆ టికెట్ బుక్ అయి ఉంది.

బ్యాంకాక్లోని సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయన దిగారు, అక్కడినుంచే మళ్లీ బయల్దేరారు. రెండుసార్లూ ఆయన థాయ్ ఎయిర్వేస్ విమానాన్నే తన ప్రయాణాలకు ఉపయోగించుకున్నారు. దాన్ని బట్టి చూస్తే, పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో సెలవు తీసుకుంటానని వెళ్లిన రాహుల్ గాంధీ.. దాదాపు రెండు నెలల పాటు థాయ్లాండ్లోనే విశ్రాంతి తీసుకున్నారా, లేక అక్కడినుంచి ఇంకా ఎక్కడికైనా వెళ్లారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement