వర్షపు నీటిని వినియోగించుకునే చర్యల్లో భాగంగా రైల్వే శాఖ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
న్యూఢిల్లీ: వర్షపు నీటిని సమర్థవంతంగా వినియోగించుకునే చర్యల్లో భాగంగా భారత రైల్వే శాఖ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మొత్తం రైల్వే స్టేషన్లలోని 2,428 స్టేషన్ బిల్డింగుల్లో వర్షపు నీటి సంరక్షణ కేంద్రాలను స్థాపించింది. పలు చోట్ల పైకప్పు ద్వారా వర్షపు నీటిని సంరక్షించే కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖకు చెందిన ఉన్నతాధికారి చెప్పారు.
ఆయా ప్రాంతాల్లో వర్షపు నీటి శాతం, మట్టి రకం, గత గణాంకాలు, అలాగే 200 చదరపు మీటర్ల కన్నా పైకప్పు ఎక్కువగా ఉన్న రైల్వే బిల్డింగ్‌లు లాంటి ప్రామాణికాలను పరిగణనలోకి తీసుకుని ఈ సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.