
కరుణానిధితో భేటీ అయిన రజనీకాంత్
చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధిని సూపర్ స్టార్ రజనీకాంత్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కురువృద్ధుడైన కరుణానిధి ఇటీల అనారోగ్యానికి గురై ఆస్పత్రి పాలైన సంగతి తెలిసిందే. ఆయన కోలుకొని ఇంటికి చేరుకున్న నేపథ్యంలో ఆయనను రజనీ కలిశారు. చెన్నైలోని తమ ఇంటికి వచ్చిన రజనీని కరుణానిధి తనయుడు, డీఎంకే నేత స్టాలిన్ సాదరంగా తోడ్కొని వెళ్లారు. ఈ భేటీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూయడంతో రాష్ట్రమంతా విషాదంలో మునిగి ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డిసెంబర్ 12న తన పుట్టినరోజు జరుపుకోవద్దని రజనీకాంత్ నిర్ణయించారు. అదేవిధంగా తన పుట్టినరోజు వేడుకలు, ఆర్భాటాలు చేయవద్దని ఆయన తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు.