మోడీ లేక... ఓట్లు రాక | Ranjanben Bhatt win by over 3.29 lakh votes | Sakshi
Sakshi News home page

మోడీ లేక... ఓట్లు రాక

Published Tue, Sep 16 2014 1:07 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

మోడీ లేక... ఓట్లు రాక - Sakshi

మోడీ లేక... ఓట్లు రాక

వడోదర: గుజరాత్ లోని వడోదర లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అధికారి బీజేపీ అభ్యర్థి రంజన్‌ బెన్ భట్టా 3,29,507 ఓట్ల మెజార్టితో గెలుపొందారు. మొత్తం 7,32,339 ఓట్లు పోల్ కాగా, రంజన్‌ బెన్ కు 5,26,763 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రావత్ కు 1,97,256 ఓట్లు వచ్చాయి. 14,257 మంది 'నోటా' నొక్కారు. ఇద్దరు స్వతంత్రులు డిపాజిట్ కోల్పోయారు.

ఈ ఏడాది ఆరంభంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన నరేంద్ర మోడీ 5,70,128 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అయితే అప్పటితో పోలిస్తే ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం బాగా తగ్గింది. మోడీ పోటీ చేసినప్పుడు 11.63 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు ఆ సంఖ్య 7.3 లక్షలకు పడిపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement