ఒక్క రూపాయికే 300 ని.ల డాటా కాల్స్ | RCom offers 300 minutes data calls at Re 1 for Delhi-NCR customers | Sakshi
Sakshi News home page

ఒక్క రూపాయికే 300 ని.ల డాటా కాల్స్

Published Tue, Aug 30 2016 2:29 PM | Last Updated on Wed, Sep 18 2019 2:52 PM

ఒక్క రూపాయికే 300 ని.ల డాటా కాల్స్ - Sakshi

ఒక్క రూపాయికే 300 ని.ల డాటా కాల్స్

న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ మంగళవారం వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది.  కాల్ డ్రాప్స్ సమస్యను అధిగమించే  లక్ష్యంతో మంగళవారం 4 జీ  యాప్ టు యాప్ కాలింగ్ సౌకర్యాన్ని  ప్రకటించింది. 30రోజులపాటు వర్తించేలా ఒక్కరూపాయి కే 300 నిమిషాల 4జీ డాటాకాలింగ్  సదపాయాన్ని ప్రకటించింది.  అయితే  ఈ ఆఫర్ దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంత వాసులకు మాత్రమే వర్తిసుంది.

ముప్పయి రోజులు.. రోజుకు పదినిముషాలు..ఒక్క రూపాయికే అందిస్తున్నామని,  ఆర్ కాం కన్జ్యూమర్ బిజినెస్ సీఈవో గురుదీప్ సింగ్ వెల్లడించారు.  దేశ రాజధాని, దాన్ని పరిసర ప్రాంత(ఎన్సీఆర్)  ప్రజలకు ఇది భారతలోనే మొదటి ఆఫర్ అనీ, కాల్ డ్రాప్ సర్వీసులనుంచి విముక్తి లభించేందుకే ఈసౌకర్యమని గురుదీప్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement