ఒక్క రూపాయికే 300 ని.ల డాటా కాల్స్
న్యూఢిల్లీ: రిలయన్స్ కమ్యూనికేషన్స్ మంగళవారం వినియోగదారులకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. కాల్ డ్రాప్స్ సమస్యను అధిగమించే లక్ష్యంతో మంగళవారం 4 జీ యాప్ టు యాప్ కాలింగ్ సౌకర్యాన్ని ప్రకటించింది. 30రోజులపాటు వర్తించేలా ఒక్కరూపాయి కే 300 నిమిషాల 4జీ డాటాకాలింగ్ సదపాయాన్ని ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంత వాసులకు మాత్రమే వర్తిసుంది.
ముప్పయి రోజులు.. రోజుకు పదినిముషాలు..ఒక్క రూపాయికే అందిస్తున్నామని, ఆర్ కాం కన్జ్యూమర్ బిజినెస్ సీఈవో గురుదీప్ సింగ్ వెల్లడించారు. దేశ రాజధాని, దాన్ని పరిసర ప్రాంత(ఎన్సీఆర్) ప్రజలకు ఇది భారతలోనే మొదటి ఆఫర్ అనీ, కాల్ డ్రాప్ సర్వీసులనుంచి విముక్తి లభించేందుకే ఈసౌకర్యమని గురుదీప్ తెలిపారు.