మోదీతో బహిరంగ చర్చకు సిద్ధం!
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం రోజురోజుకు వేడెక్కుతోంది. రాజకీయ నాయకులు విమర్శలు, ప్రతి విమర్శలతో హోరెత్తుతోంది. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. విద్యుత్ సరఫరా విషయంలో మతవివక్ష పాటిస్తున్నారని దుయ్యబట్టారు.
ఈద్‌కు ఏవిధంగా అయితే విద్యుత్ సరఫరా చేశారో.. దీపావళికి కూడా అదేవిధంగా విద్యుత్‌ను అందించాలని అన్నారు. అయితే, ప్రధాని మోదీ విమర్శలను యూపీ సీఎం అఖిలేశ్ తిప్పికొట్టారు. విద్యుత్ సరఫరా విషయంలో ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. 'గంగమాత మీద ఒట్టేసి చెప్తున్నా.. ఆధ్యాత్మిక ప్రదేశాలైన మథుర, కాశీలకు పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా అందించాం. ఇది నిజం కాదని ప్రధాని మోదీ గంగమ్మ మీద ఒట్టేసి చెప్పగలరా' అని ఆయన 'ఎన్డీటీవీ'తో మాట్లాడుతూ పేర్కొన్నారు.