అరవింద్ కేజీవ్రాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మి పార్టీ (ఏఏపీ)కి విరాళాల రూపంలో ఇప్పటి వరకు రూ. 12 కోట్లు వచ్చాయని ఆ పార్టీ ఆదివారం న్యూఢిల్లీలో విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. తమ పార్టీకి విరాళాలు అందించిన వారిలో రిక్షా కార్మికులు, బడా వ్యాపారులు, ప్రవాస భారతీయులు ఉన్నారని తెలిపింది. రూ. 10 లు నుంచి లక్షలు వరకు తమ పార్టీకి విరాళాలుగా వచ్చాయని పేర్కొంది. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి ఆ విరాళాలు మొత్తం రూ. 20 కోట్లుకు చేరుతోందని ర్కొందని ఆశాభావం వ్యక్తం చేసింది.
రోజుకు రూ. 10 లక్షల వరకు విరాళాలు వస్తున్నాయని చెప్పింది. యూఎస్ నుంచి తమ పార్టీకి అధిక మొత్తంలో విరాళాలు అందుతున్నాయని ఏఏపీ చెప్పింది. అలాగే జర్మనీ, ఖత్తార్, కువైట్, న్యూజిలాండ్, సింగపూర్, నార్వే, బ్రిటన్ తదితర దేశాల నుంచి ఎన్నారైలు నిధులు అందుతున్నాయని వివరించింది. గతేడాది నవంబర్లో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు, నాటి నుంచి వచ్చిన ప్రతి రూపాయికి సంబంధించిన వివరాలను తమ పార్టీ వెబ్సైట్లో ఉంచినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసిన ఆ ప్రకటనలో పేర్కొంది.