
ఉద్యోగాలు-రుణాల్లో మత, లింగ వివక్ష
భారత్‌లో ఉద్యోగాలు, రుణాలు పొందడానికి మత, లింగపరమైన అంశాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని అంతర్జాతీయ
న్యూఢిల్లీ: భారత్‌లో ఉద్యోగాలు, రుణాలు పొందడానికి మత, లింగపరమైన అంశాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం మాస్టర్‌కార్డ్ రూపొందించిన సర్వేలో వెల్లడైంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నెట్‌వర్క్‌ల పాత్ర, ఆర్థిక సమ్మిళిత అంశాలపై అధ్యయనం చేసే మాస్టర్‌కార్డ్ కనెక్టర్స్ ప్రాజెక్టులో భాగంగా మాస్టర్ కార్డ్ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. అందరికీ ఆర్థిక సేవలు అందుబాటులో ఉండేందుకు గాను నరేంద్ర మోదీ ప్రభుత్వం జనధనయోజనను ప్రారంభించింది. రోజుకు రూపాయి కంటే తక్కువకే జీవిత బీమా కవర్‌ను, అలాగే నెలకు రూ. 1 చొప్పున చెల్లించే ప్రీమియంతో ఆరోగ్య, యాక్సిడెంట్ కవర్‌ను అందించే స్కీమ్‌ల ఇటీవలనే ప్రారంభమైన నేపథ్యంలో వెలువడిన ఈ సర్వే పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు...,
లింగపరమైన అంశం కారణంగా ఉద్యోగాలు, రుణాలు పొందడానికి ఇబ్బందులు పడ్డామని భారత్ నుంచి సర్వేలో పాల్గొన్నవారిలో 58 శాతం మంది పేర్కొన్నారు. ఇతర దేశాల్లో ఇలా చెప్పినవారు 33 శాతంగా ఉన్నారు.
ఇక మతం కారణంగా రుణాలు,ఉద్యోగాలు పొందడానికి ఇబ్బందులు పడ్డామని భారత్ నుంచి సర్వేలో పాల్గొన్నవారిలో 58 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇతర దేశాల్లో ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినవారు 28 శాతం మాత్రమే.
ఉద్యోగాలు, రుణాలు పొందడంలో మహిళలకు, మతపరంగా మైనార్టీలుగా ఉన్న వారు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
పౌర జీవనం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన విషయాల్లో మాత్రం ఇతర దేశాల్లో కంటే భారత్ మెరుగైన స్థానంలో ఉంది.