ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌ వీడియో | Road raze icedent in new delhi | Sakshi
Sakshi News home page

ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌ వీడియో

Published Thu, Jan 5 2017 1:39 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM

ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌ వీడియో - Sakshi

ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌ వీడియో

ఒళ్లు గగుర్పొడిచే రీతిలో దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన ఓ యాక్సిడెంట్‌ విజువల్స్‌ తాజాగా వెలుగులోకి వచ్చాయి. కొత్త సంవత్సరంనాడు ఢిల్లీ సాగర్‌పూర్‌లోని పింక్‌ అపార్ట్‌మెంట్స్‌ నుంచి బయటకు వచ్చిన ఓ మహిళ.. ఆటో కోసం రోడ్డు పక్కన ఎదురుచూస్తుండగా.. అదే సమయంలో అపార్ట్‌మెంట్స్‌ నుంచి వచ్చిన వాగన్‌ ఆర్‌ కారు ఆమెకు చేరువలో రోడ్డు దాటేందుకు సిద్ధంగా ఉంది. ఇంతలో అవతలివైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ ఎర్టిగా కారు.. అదుపు తప్పి మొదట మహిళను, ఆ వెంటనే వాగన్‌ ఆర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాల మధ్య నలిగి తీవ్రంగా గాయపడ్డ మహిళ.. వేగర్‌ ఆర్‌ కింద ఇరుక్కుపోయింది. స్థానికులు అతికష్టమ్మీద ఆమెను బయటకు తీశారు. ఒళ్లు గగుర్పొడిచేరీతిలో జరిగిన ఈ ప్రమాదంలో ఆమె ప్రాణాలతో బయటపడటం గమనార్హం.

కాగా, ఈ ప్రమాదానికి పాల్పడింది ఓ వీఐపీ కుమారుడని, మైనర్‌ అని గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత అతను పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గాయపడ్డ మహిళను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement