
కార్లో కళ్లు చెదిరే బంగారం.. 2.85 కోట్ల డబ్బులు
మలప్పురం(కేరళ): రోజువారి తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు భారీ మొత్తంలో సొమ్మును, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకే కారులో దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు, 15 కేజీల బంగారం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ ఘటన కేరళలోని పెరింతల్ మన్నా అనే ప్రాంతంలో చోటుచేసుకుంది.
ఈ వివరాలు పోలీసులు తెలియజేస్తూ తాము ప్రతి రోజు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఐదుగురు వ్యక్తులతో అనుమానంగా వస్తున్న ఓ కారు తమ కంట పడిందని, దానిని ఆపి తనిఖీలు చేయగా కళ్లు చెదిరే రీతిలో బంగారం, డబ్బులు కనిపించాయని తెలిపారు. దాని గురించిన వివరాలు సంబంధిత వ్యక్తులు తెలియజేయలేకపోయినందున వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వివరించారు.