రూ. 3,600 కోట్ల హెలికాప్టర్ ఒప్పందం రద్దు | Rs. 3600 crore VVIP chopper deal with Agusta Westland scrapped | Sakshi
Sakshi News home page

రూ. 3,600 కోట్ల హెలికాప్టర్ ఒప్పందం రద్దు

Published Wed, Jan 1 2014 4:50 PM | Last Updated on Mon, May 28 2018 3:25 PM

రూ. 3,600 కోట్ల హెలికాప్టర్ ఒప్పందం రద్దు - Sakshi

రూ. 3,600 కోట్ల హెలికాప్టర్ ఒప్పందం రద్దు

భారతీయ వైమానిక దళానికి 12 వీవీఐపీ హెలికాప్టర్లను సరఫరా చేయడానికి ఆంగ్లో-ఇటాలియన్ కంపెనీ అగస్టా వెస్ట్లాండ్తో గతంలో కుదిరిన భారీ ఒప్పందాన్ని భారత్ రద్దుచేసుకుంది. రూ. 3,600 కోట్ల విలువైన ఈ ఒప్పందం కుదరడానికి ఆ కంపెనీ కొంతమంది వ్యక్తులకు రూ. 360 కోట్లు లంచం ముట్టజెప్పిందని ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2010లో కుదిరిన ఈ ఒప్పందం కోసం భారత వైమానిక దళం మాజీ అధిపతి ఎస్.పి. త్యాగి తదితరులకు భారీ మొత్తంలో లంచాలు ముట్టజెప్పారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.

ఈ కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే.. ఈలోపు బుధవారం ఉదయం ప్రధాని మన్మోహన్ సింగ్, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీల మధ్య కుదిరిన సమావేశం అనంతరం ఈ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. కాగా, మొత్తం 12 హెలికాప్టర్లకు గాను ఇప్పటికే మూడింటిని అగస్టా వెస్ట్లాండ్ సంస్థ భారత్కు పంపేసింది. ఇప్పుడు ఈ కంపెనీతో ఆర్బిట్రేషన్కు వెళ్లాలని భారత్ నిర్ణయించుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement