అక‍్కడ 10 రూపాయల నాణెం తీసుకోవట్లేదు | Rumours of ban on Rs 10 coins trigger panic in Odisha | Sakshi
Sakshi News home page

అక‍్కడ 10 రూపాయల నాణెం తీసుకోవట్లేదు

Published Tue, Nov 15 2016 6:17 PM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM

అక‍్కడ 10 రూపాయల నాణెం తీసుకోవట్లేదు

అక‍్కడ 10 రూపాయల నాణెం తీసుకోవట్లేదు

భువనేశ్వర్‌: కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత రకరకాల వదంతులు వస్తున్నాయి. ఉప్పుకు కొరత ఏర్పడిందని యూపీ, హైదరాబాద్‌లో పుకార్లు రాగా, తాజాగా ఒడిశాలో 10 రూపాయల నాణేలు మారవంటూ వదంతులు వచ్చాయి. 10 రూపాయల నాణెం చెల్లదంటూ రిజర్వ్‌బ్యాంకు ప్రకటించినట్టు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరిగింది.

దీంతో ఒడిశాలో ఆటో డ్రైవర్లు, వర్తకులు 10 రూపాయల నాణేలను తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. అలాగే షాపులు, తోపుడు బండ్లు, ఇతర దుకాణాల్లో వీటిని తీసుకోలేదు. కొందరు 10 రూపాయల నాణేలను మార్చుకునేందుకు భువనేశ్వర్‌లోని ఆర్‌బీఐ కార్యాలయానికి వెళ్లారు. కాగా ఇవన్నీ వదంతులేనని, 10 రూపాయల నాణేలను రద్దు చేయలేదని, చెలామణిలో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా వీటిని తీసుకునేందుకు నిరాకరిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటారని హెచ్చరించారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement