Rs 10 coins
-
లక్ష కంటే ఖరీదైన స్కూటర్.. చిల్లరతో కొనేసాడు - ఎక్కడో తెలుసా?
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో జేబులో డబ్బు పెట్టుకునే వారే కరువయ్యారు. ఏ చిన్న వస్తువు కొనాలన్నా అంతా ఆన్లైన్ పేమెంట్ చెల్లిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రమే తనకు ఇష్టమైన స్కూటర్ కొనటానికి మొత్తం చిల్లర ఇచ్చి షోరూమ్ వారికే షాక్ ఇచ్చాడు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన వ్యక్తి ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనడానికి మొత్తం చిల్లర అందించాడు. దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. సుమారు లక్ష కంటే ఖరీదైన స్కూటర్‌ను చిల్లరతో కొనేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఏథర్ ఎనర్జీ సీఈఓ 'తరుణ్ మెహతా' స్కూటర్ డెలివరీ చేసి, స్వయంగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతలో ఫోటో షేర్ చేస్తూ.. జైపూర్ వ్యక్తి 10 రూపాయల నాణేలతో స్కూటర్ కొన్నాడని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. జైపూర్ వ్యక్తి కొనుగోలు చేసిన ఏథర్ 450 సిరీస్ ఖచ్చితమైన మోడల్‌ను మెహతా పేర్కొనలేదు. కాబట్టి దీని ధర ఎంత అనేది స్పష్టంగా తెలియదు. ఏథర్ 450ఎక్స్, 450ఎస్, 450అపెక్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుందో. వీటి ధరలు రూ. 1.10 లక్షల నుంచి రూ. 1.75 లక్షల మధ్య ఉన్నాయి. ఇదీ చదవండి: 2000 ఉద్యోగాలు రెడీ..! ఎక్కడో తెలుసా? A new Ather owner just bought himself a 450 in Jaipur ... all with 10Re coins! pic.twitter.com/VWoOJiQey2 — Tarun Mehta (@tarunsmehta) February 17, 2024 -
ఇక రూ.10 నాణేలే దిక్కు..!
భోపాల్ : బ్యాంకుల్లో నగదు లేక, ఏటీఎంలు నో క్యాష్ బోర్డులతో వెక్కిరిస్తుంటే, దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇక్కట్లు పాలవుతున్నారు. ఈ నగదు కొరతను సమస్యను తీర్చడానికి ప్రభుత్వం, ఆర్బీఐ రంగంలోకి దిగినప్పటికీ, పరిస్థితిలో అంత మార్పేమీ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా బ్యాంకులకు రూ.10 నాణేలే దిక్కయ్యాయి. కస్టమర్లు నగదు విత్‌డ్రా చేసుకోవడానికి వస్తే, వారికి గ్రామీణ బ్యాంకులు రూ.10 నాణేలను చెల్లిస్తున్నట్టు తెలిసింది. సాగర్, డామో, ఛతర్పూర్, తికంగఢ్ వంటి చిన్న ప్రాంతాల్లో ప్రైవేట్, పబ్లిక్ రంగ బ్యాంకులు నగదు విత్‌డ్రా చేసుకోవడానికి వచ్చిన వారికి రూ.10 నాణేలను ఇస్తున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. ‘ఏటీఎంలో డబ్బులు లేక, డ్రైగా మారిపోయాయి. 10వేల రూపాయలను విత్‌డ్రా చేసుకోవడానికి నేను సాగర్‌లోని ఎస్బీఐ బ్రాంచుకు వెళ్లాను. వారు రూ.10 కాయిన్ల రూపంలో వెయ్యి రూపాయలు నా చేతిలో పెట్టారు’ అని సాగర్‌కు చెందిన వ్యవసాయదారుడు రామధీర్ పటేల్ తెలిపారు. చాలా బ్యాంకు శాఖలు కూడా 10వేల రూపాయల వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకోవాలని పరిమితి విధించాయి. అయితే పెద్ద ఎత్తున నగదు కొరత ఏర్పడటంపై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రూ.2000 నోట్ల కొరత వెనుక ఏదో కుట్ర ఉందని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపిస్తున్నారు. చాలా కోపరేటివ్ బ్యాంకు శాఖల్లో, ఇతర బ్యాంకు శాఖల్లో నగదు దొరకక ప్రజలకు అల్లాడుతున్నారు. తమ వద్ద సరిపడినంత బ్యాంకు బ్యాలెన్స్ ఉందని, కానీ కూతురు పెళ్లికి వాటిని విత్‌డ్రా చేసుకోవడమే కుదరడం లేదని ఓ వ్యవసాయదారుడు అన్నారు. -
రూ.10 నాణేలు చెల్లుతాయి...
పుకార్లు నమ్మవద్దని బ్యాంకర్ల స్పష్టీకరణ సిటీబ్యూరో: నగరంలో రూ.10 నాణేల చెలామణిపై కొందరిలో నెలకొన్న అనుమానాలను పలువురు బ్యాంకర్లు నివృత్తి చేశారు. ఇవి బహిరంగ మార్కెట్లు, బ్యాంకులు, ఇతర ఆర్థిక లావాదేవీల్లో నిర్భయంగా చెలామణి చేసుకోవచ్చని స్పష్టంచేశారు. రూ.10 కాయిన్ల చెలామణి, నకిలీ కాయిన్ల వెల్లువపై సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోవద్దని సూచించారు. అయితే ఇటీవలికాలంలో పలు పెట్రోలుబంకుల యజమానులు, కిరాణా వర్తకులు ఈ కాయిన్లను స్వీకరించకపోవడం పట్ల పలువురు సిటీజనులు ఆందోళనతో బ్యాంకుల వద్దకు పరుగులుతీశారు. తమ వద్ద పోగుపడిన కాయిన్లను తమ అకౌంట్లలో జమచేసేందుకు పోటీపడడంతో గందరగోళం నెలకొంది. అయితే ఇవన్నీ పుకార్లేనని..ఈ కాయిన్ల చెలామణిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి ఆదేశాలు జారీచేయలేదని బ్యాంకర్లు స్పష్టం చేశారు. -
రూ. పది నాణేలు చెల్లుతాయ్
అమరావతి: ‘సార్... రూ.10 నాణేలు ఎవ్వరూ తీసుకోవడం లేదు సార్... నా దగ్గర రూ.3,000 విలువైన రూ.10 నాణేలు ఉన్నాయి. రూ. 2,500 ఇచ్చి ఈ మొత్తం తీసుకోండి సార్’... ఇదీ విజయవాడలోని పాన్ షాపు యజమాని ఆందోళన. కాకినాడకు చెందిన ఈశ్వర్ రూ.5,000 విత్‌డ్రా చేసుకుందామని బ్యాంకుకు వెళితే మొత్తం రూ.10 నాణేలే ఇచ్చారు. ‘సార్ ఇవి బయట చెల్లడం లేదు నోట్లు ఇవ్వమని అడిగితే.. రూ.10 నాణేలు ఇచ్చినట్లు బుక్‌లో రాసేశాము.. మార్చడం కుదరదు’ అన్నారు. తీరా బయట ఇస్తే ఎవ్వరూ తీసుకోవడం లేదు. ఏమి చేయాలో అర్థం కావడం లేదంటూ ఈశ్వర్ వాపోయారు. పది రూపాయల నాణేలు చెల్లడం లేదంటూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున వదంతులు షికార్లు చేస్తున్నాయి. దీంతో కిరాణా, పాన్ షాపుల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. తాము ఇస్తే నాణేలు ఎవ్వరూ తీసుకో వడం లేదని, కానీ సిగరెట్లు వెలిగించుకున్న తర్వాత ఆనాణేలు అంటగట్టి వెళ్లిపోతున్నా రంటూ పాన్‌షాపు వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ వదంతులే, వీటిని నమ్మవద్దని ఆర్బీఐ పేర్కొంది. రూ.10 నాణేలు చెల్లుతాయని, వీటిని చెలామణీలోంచి ఉపసంహరించే ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేసింది. ఈ మధ్యనే జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆర్బీఐ రీజనల్ డైరక్టర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. రూ.10 నాణేలు చెల్లవన్న వదంతులను ఖండించారు. అసలు ఈ ప్రచారం ఎక్కడ మొదలయ్యిందో, ఎవరు ఎందుకు వ్యాప్తి చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. అన్ని రకాల పది రూపాయల నాణేలు చెల్లుబాటు అవుతాయని, వదంతులను నమ్మవద్దని స్పష్టం చేశారు. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలై వారం రోజులు దాటుతున్నా ఇప్పటి వరకు రాష్ట్రానికి ఆర్బీఐ నుంచి ఒక్క నయాపైసా కూడా రాలేదు. దీంతో రాష్ట్రంలో నగదుకొరత అంతకంతకు తీవ్రమవుతోంది. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంక్ వంటి పెద్ద బ్యాంకులు తీవ్ర నగదు కొరతను ఎదుర్కొంటున్నాయి. చిన్న బ్యాంకులు రొటేషన్ విధానంలో తమ దగ్గర ఉన్న నగదుతో నెట్టుకొస్తున్నాయి. రాష్ట్రంలో నగదు కొరత గురించి ఆర్బీఐ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకువెళ్తున్నామని, మార్చి 31న తక్షణ అవసరాలకు రూ. 800 కోట్లు పంపుతున్నట్లు ఆర్బీఐ హామీ ఇచ్చిందని, కానీ ఆ మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రానికి చేరలేదని ఆ అధికారి స్పష్టం చేశారు. నగదు కొరతతో ఏటీఎంలు సగానికిపైగా పనిచేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
రూ.10 నాణేలపై దుష్ప్రచారం
► నాణేలపై నిషేధం ఏమీ లేదు- ఆంధ్రా బ్యాంక్ డీజీఎం కర్నూలు: రూ.10 నాణేలను కేంద్ర ప్రభుత్వం కానీ, రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా కానీ ఎలాంటి నిషేధం విధించలేదు. కనీసం ఆ ఆలోచన కూడా ఆర్బీఐకి లేదు. రిజర్వుబ్యాంకు నుంచి యథావిదిగా నాణేలు సరఫరా అవుతున్నాయి. అయితే రూ. 10 నాణేలు చెల్లుబాటు కావన్న పుకార్లు షికార్లు చేస్తుండడంతో చిన్నచిన్న వ్యాపారులు, దుకాణదారులు వాటిని తీసుకునేందుకు జంకుతున్నారు. ఈ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యం గా డోన్, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు తదితర ప్రాంతాల్లో వ్యాపారులు వీటిని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. బ్యాంకర్లు మాత్రం నాణేల చెల్లుబాటుకు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఆంధ్రాబ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ రఘునాథ్‌ను వివరణ కోరగా పది రూపాయల నాణేలు చెల్లుబాటు కావన్నది దుష్ప్రచారం మాత్రమేనన్నారు. ఏ బ్యాంకుకు వెళ్లినా వాటిని తీసుకుంటారని తెలిపారు. ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు ఎవ్వరో ఉద్దేశపూర్వకంగా ఇలా ప్రచారం చేస్తున్నారన్నారు. -
పుకార్లు..షికార్లు
రూ.10 నాణేలు రద్దు చేసినట్లు ప్రచారం దుకాణాలు, హోటళ్లలో నాణేలు తీసుకోని వైనం బ్యాంకులకు క్యూకడుతున్న వ్యాపారులు నెల్లూరు సిటీ : గతేడాది నవంబర్‌లో పెద్దనోట్లు రద్దు తరువాత ప్రధాని నరేంద్రమోదీ ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటారోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అప్పటి నుంచి రూ.100 కాగితం రద్దు చేస్తారని, కొత్త రూ.2000 నోటు మళ్లీ రద్దు చేస్తున్నారని, రూ.1000 నోటు కొత్తది ముద్రిస్తున్నారని ఇలా ప్రతిరోజూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే కొత్తగా రూ.10 నాణేలు ప్రభుత్వం రద్దు చేస్తుందని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో అన్ని దుకాణాలు, హోటల్స్, భారీ షోరూమ్స్, సినిమా థియేటర్లలో రూ.10 నాణేలను ఆయా యాజమాన్యాలు తీసుకోవడం లేదు. దీంతో ప్రజల్లో ఆందోళన ఎక్కువైంది. దీంతో ఇప్పటి వరకు తాము దాచుకున్న రూ.10 నాణేలను వ్యాపారులు, ప్రజలు బయటకుతీస్తున్నారు. దుకాణాల్లో మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. స్టౌన్‌హౌస్‌పేటలోని ఓ బ్యాంకు సిబ్బంది రూ.10 నాణేలను తీసుకునేందుకు నిరాకరించారని ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ఇది పుకార్లకు మరింత బలం చేకూర్చింది. అయితే బ్యాంకు అధికారులు మాత్రం పుకార్లను నమ్మవద్దని చెబుతున్నారు. బాబోయ్..నకిలీ నాణేలు చిల్లకూరు : నోట్ల నకిలీలతోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనానికి ఇప్పుడు రూ.10 నాణేలు కూడా నకిలీలు రావడంతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. వివరాలు..నాలు గు రోజుల క్రితం చిల్ల కూరుకు చెందిన ఓ చిరు వ్యాపారి తన వద్ద ఉన్న రూ.10 నాణేలను బ్యాంకు లో డిపాజిట్ చేసేందుకు వెళ్లగా వాటిలో కొన్ని నాణేలు నకిలీవని అధికారులు పక్కన పెట్టారు. నకిలీ నాణేలను ఎలా గుర్తించాలని అడగడంతో వాటికి ఉన్న తేడాలను తెలియజేసి నకిలీ నాణేలను వారే తీసేసుకున్నారు. ఇటీవల నకిలీ రూ.10 నాణేలు విచ్చలవిడిగా చెలామణి అవుతుండడంతో వాటిని తీసుకునేందుకు అటు వ్యాపారులు, ఇటు ప్రజలు ముందుకు రావడం లేదు. నకిలీ నాణేలను సులువుగానే గుర్తించవచ్చని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. నకిలీ నాణేనికి హిందీ అక్షరం(రూ) లేకుండానే 10 అంకె మాత్రమే ఉంటుందని, నాణేనికి మరో వైపున రెండు అడ్డ గీతలు ఉంటాయని చెబుతున్నారు. -
అక్కడ 10 రూపాయల నాణెం తీసుకోవట్లేదు
భువనేశ్వర్: కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత రకరకాల వదంతులు వస్తున్నాయి. ఉప్పుకు కొరత ఏర్పడిందని యూపీ, హైదరాబాద్‌లో పుకార్లు రాగా, తాజాగా ఒడిశాలో 10 రూపాయల నాణేలు మారవంటూ వదంతులు వచ్చాయి. 10 రూపాయల నాణెం చెల్లదంటూ రిజర్వ్‌బ్యాంకు ప్రకటించినట్టు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరిగింది. దీంతో ఒడిశాలో ఆటో డ్రైవర్లు, వర్తకులు 10 రూపాయల నాణేలను తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. అలాగే షాపులు, తోపుడు బండ్లు, ఇతర దుకాణాల్లో వీటిని తీసుకోలేదు. కొందరు 10 రూపాయల నాణేలను మార్చుకునేందుకు భువనేశ్వర్‌లోని ఆర్బీఐ కార్యాలయానికి వెళ్లారు. కాగా ఇవన్నీ వదంతులేనని, 10 రూపాయల నాణేలను రద్దు చేయలేదని, చెలామణిలో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా వీటిని తీసుకునేందుకు నిరాకరిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటారని హెచ్చరించారు. -
ఆ నాణేలు వద్దంటే దేశ ద్రోహం కేసే
పిలిబిత్: ఆర్బీఐ ఆమోదించిన ద్రవ్యాన్ని స్వీకరించేందుకు నిరాకరించిన వ్యక్తులపై సెక్షన్ 124(ఏ) కింది దేశ ద్రోహం కేసు పెట్టవొచ్చని ఉత్తరప్రదేశ్ లోని పిలిబిత్ జిల్లా మేజిస్ట్రేట్ ఉత్వర్వులు ఇచ్చారు. అసలు ఎందుకు ఇలాంటి ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చిందంటే.. పుల్కిత్ శర్మ అనే ఓ వ్యక్తి బరేలీలో ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఆయన దుకాణదారుల నుంచి ఆయన పది రూపాయల నాణేలు తీసుకునే వాడుకానీ, ఆయన వద్ద నుంచి తిరిగి వాటిని తీసుకునేందుకు ఎవ్వరూ అంగీకరించేవారు కాదు. ఈ నాణేలకు చట్టపరమితి ఎక్కువకాలం లేదని, చెల్లుబాటుకావని ఊహాగానాలు అందడంతో వాటిని ఎవరూ తీసుకోలేదు. దీంతో అతడి వద్ద గత రెండు మూడు నెలలుగా కుప్పలుగా పది రూపాయల నాణేలు మిగిలిపోయాయి. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చేరి వాట్సాప్ ద్వారా పలువురి వద్దకు వెళ్లింది. చివరకు జిల్లా వ్యాప్తంగా ఈ వార్త హల్ చల్ చేయడంతో దీనిపై జిల్లా న్యాయమూర్తి స్పందించారు. రూ.10 నాణేనికి చట్టబద్ధత ఉందని, ఆర్బీఐ ఆమోదించిన ద్రవ్యాన్ని నిరాకరిస్తే చట్టపరంగా తప్పు చేసినవారవుతారని అలాంటి వారిపై దేశద్రోహం శిక్ష నమోదు చేయవచ్చని చెప్పారు.