ఆ నాణేలు వద్దంటే దేశ ద్రోహం కేసే
పిలిబిత్: ఆర్బీఐ ఆమోదించిన ద్రవ్యాన్ని స్వీకరించేందుకు నిరాకరించిన వ్యక్తులపై సెక్షన్ 124(ఏ) కింది దేశ ద్రోహం కేసు పెట్టవొచ్చని ఉత్తరప్రదేశ్ లోని పిలిబిత్ జిల్లా మేజిస్ట్రేట్ ఉత్వర్వులు ఇచ్చారు. అసలు ఎందుకు ఇలాంటి ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చిందంటే.. పుల్కిత్ శర్మ అనే ఓ వ్యక్తి బరేలీలో ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఆయన దుకాణదారుల నుంచి ఆయన పది రూపాయల నాణేలు తీసుకునే వాడుకానీ, ఆయన వద్ద నుంచి తిరిగి వాటిని తీసుకునేందుకు ఎవ్వరూ అంగీకరించేవారు కాదు.
ఈ నాణేలకు చట్టపరమితి ఎక్కువకాలం లేదని, చెల్లుబాటుకావని ఊహాగానాలు అందడంతో వాటిని ఎవరూ తీసుకోలేదు. దీంతో అతడి వద్ద గత రెండు మూడు నెలలుగా కుప్పలుగా పది రూపాయల నాణేలు మిగిలిపోయాయి. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చేరి వాట్సాప్ ద్వారా పలువురి వద్దకు వెళ్లింది. చివరకు జిల్లా వ్యాప్తంగా ఈ వార్త హల్ చల్ చేయడంతో దీనిపై జిల్లా న్యాయమూర్తి స్పందించారు. రూ.10 నాణేనికి చట్టబద్ధత ఉందని, ఆర్బీఐ ఆమోదించిన ద్రవ్యాన్ని నిరాకరిస్తే చట్టపరంగా తప్పు చేసినవారవుతారని అలాంటి వారిపై దేశద్రోహం శిక్ష నమోదు చేయవచ్చని చెప్పారు.