మళ్లీ కళ తప్పిన రూపాయి
Published Tue, Sep 3 2013 1:16 AM | Last Updated on Fri, Sep 1 2017 10:22 PM
ముంబై: రెండు రోజుల రూపాయి ర్యాలీకి బ్రేక్ పడింది. డాలరుతో మారకంలో సోమవారం 30 పైసలు(0.46%) బలహీనపడి 66 వద్ద ముగిసింది. గత రెండు రోజుల్లో 310 పైసలు(4.5%) బలపడటం ద్వారా 68.80 నుంచి 65.70కు చేరిన సంగతి తెలిసిందే. కాగా, దిగుమతిదారుల నుంచి పెరిగిన డిమాండ్ నేపథ్యంలో ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 66.15 వద్ద బలహీనంగా మొదలైంది. ఒక దశలో 65.68కు బలపడినప్పటికీ, 66.30 వద్ద కనిష్ట స్థాయిని సైతం తాకింది. చివరికి 30 పైసలు క్షీణించి 66 వద్ద స్థిరపడింది.
Advertisement
Advertisement