ఉద్యోగాల కోతపై ఇన్ఫీ మూర్తి స్పందన
బెంగళూరు: ఐటీ రంగంలో భారీ ఉద్యోగాల కోతపై ఇన్ఫోసిస్ ఫౌండర్ ఛైర్మన్ నారాయణ మూర్తి స్పందించారు. ప్రధాన ఐటీ కంపెనీలు తమ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకోవడంపై ఆయన శుక్రవారం స్పదించారు. తమ ఖర్చులను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా ఉద్యోగులపై వేటు వేయడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటీవలి ఐటీ ఉద్యోగుల తీసివేతలపై పీటీఐ ఈ మెయిల్‌కు స్పందించిన ఆయన ఉద్యోగులను తొలగించడం విచారకరమని సమాధానం ఇచ్చారు. అయితే ఇంతకుమించి ఆయన తన అభిప్రాయ వివరాలు వివరించలేదు.
కాగా ఆటోమేషన్, ట్రంప్ కొత్త హెచ్1 బీ వీసా కొత్త నిబంధనల నేపథ్యంలో ఐటీ రంగం సంక్షోభంలో చిక్కుకుంది. ఉద్యోగులను తొలగించనున్న ఇన్ఫోసిస్ ప్రకటించింది. సవాలుగా ఉన్న వ్యాపార పర్యావరణంలో ద్వి వార్షిక పనితీరు సమీక్షను నిర్వహిస్తున్నందున, వందలాది మంది మధ్యస్థ , సీనియర్-స్థాయి ఉద్యోగులకు పింక్ స్లిప్స్ అందిస్తున్నట్టు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఇదే బాటలో విప్రో కూడా పయనించింది. తన వార్షిక "పనితీరు అంచనా" లో భాగంగా 600 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు వెల్లడించింది. అయితే, కాగ్నిజెంట్ మాత్రం ఉద్యోగుల తొలగింపుల వార్తలను ఖండించిన సంగతి తెలిసిందే.