IT layoffs
-
కాలగర్భంలో కలల ఉద్యోగం..!
చిన్నపుడు ఎవరైనా ‘పెద్దయ్యాక ఏం చేయాలనుకుంటున్నావ్?’ అని అడిగితే చాలామంది పెద్ద సాఫ్ట్వేర్ ఇంజినీరో లేదా ప్రపంచంలోని టాప్ టెక్ కంపెనీలో మంచి ఉద్యోగం చేయాలని చెప్పేవారు. అదే డ్రీమ్ జాబ్‌గా ఊహించుకుని కష్టపడి చదివి ఏదో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరినవారు కూడా ఉన్నారు. అయితే మారుతున్న జీవన శైలి, టెక్ కంపెనీలో వస్తున్న మార్పులు తమ కలల సాకారానికి వ్యతిరేకంగా ఉంటున్నాయని చెబుతున్నారు. ప్రధానంగా ‘జెన్ జీ’(1997-2005 మధ్య జన్మించిన వారు) యువతకు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది.కొవిడ్ సమయంలో ఐటీ కంపెనీల రెవెన్యూ గణనీయంగా తగ్గిపోయింది. ప్రధానంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగాల జీతాలకే ఎక్కువగా ఖర్చు అవుతుంది. దాంతో కరోనా కాలంలో అదే అదనుగా లేఆఫ్స్ పేరుతో చాలామంది ఉద్యోగులను తొలగించారు. ‘జెన్ జీ’ యువతకు కొత్తగా టెక్ జాబ్స్ సంపాదించడం సవాలుగా మారింది. ఇప్పటికీ ఇది కొనసాగుతోంది. కొన్ని కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి నెలలు గడుస్తున్నా ఆఫర్లేటర్ ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ ‘డ్రీమ్‌జాబ్’ ఊహ నుంచి క్రమంగా బయటకొచ్చి ఇతర ఉద్యోగాలను ఎంచుకుంటున్నారు.సాఫ్ట్వేర్ కంపెనీలే ఉద్యోగులను తొలగించడంతోపాటు ఉన్నవారిపై పని ఒత్తిడి పెంచుతున్నాయి. 2022లో ప్రపంచవ్యాప్తంగా 1064 ప్రధాన కంపెనీలు 1,65,269 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. 2023లో 1193 సంస్థల నుంచి 2,64,220 మంది టెకీలు, 2024లో ఇప్పటి వరకు 398 కంపెనీల్లో 1,30,482 మంది సాఫ్ట్వేర్లను ఇంటికి పంపించాయి. వర్క్‌ఫ్రమ్ హోం ఇస్తున్నామనే ఉద్దేశంతో దాదాపు అన్ని కంపెనీలు నియమాలకంటే ఎక్కువసేపు పని చేయిస్తున్నాయి. దాంతో ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న కొందరు ఉద్యోగార్థులు తమ చిన్నప్పటి ‘డ్రీమ్‌జాబ్’కు స్వస్తి పలుకుతున్నారు.ఇదీ చదవండి: ప్రపంచాన్ని శాసిస్తున్న రంగాలు.. వాటి ఆదాయాలుఇప్పటికే టెక్ కంపెనీల్లో పనిచేస్తున్న 51 శాతం ఉద్యోగులు తమ కుటుంబాలతో కలిసి ఉండేందుకు, పిల్లల చదువుల కోసం, వారితో సమయం గడుపుతూ మెరుగైన భవిష్యత్తు అందించేందుకు వేరే కొలువులవైపు మొగ్గు చూపుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇదిలాఉండగా, దేశవ్యాప్తంగా 19 శాతం జెన్ జీ ఉద్యోగులు తన ‘డ్రీమ్‌జాబ్’ను నెరవేర్చుకునేందుకు టాప్ కంపెనీలను ఎంచుకుంటున్నట్లు కొన్ని సర్వేల్లో వెల్లడైంది. ఏదేమైనా సరైన నైపుణ్యాలున్న వారికి ఏ కంపెనీలోనైనా కొలువు సిద్ధంగా ఉంటుంది. భవిష్యత్తులో డిమాండ్ ఉండే కోర్సులు నెర్చుకుని అందులో అడ్వాన్స్డ్ స్కిల్స్ సంపాదిస్తే ఉద్యోగం ఖాయం. వృత్తి జీవితం వేరు. వ్యక్తిగత జీవితం వేరు. రెండింటిని బ్యాలెన్స్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుని పాటించాలి. -
ఆ కంపెనీ టెకీలపై లేఆఫ్ పిడుగు! 12,500 మంది తొలగింపు
ప్రముఖ టెక్నాలజీ కంపెనీ డెల్ టెక్నాలజీస్ మళ్లీ భారీ సంఖ్యలో తొలగింపులను ప్రకటించింది. గత 15 నెలల్లో ఇది రెండవ రౌండ్ లేఆఫ్. కంపెనీ ఈసారి దాదాపు 12,500 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది దాని మొత్తం వర్క్ ఫోర్స్‌లో దాదాపు 10 శాతం.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక ఐటీ సొల్యూషన్స్‌లో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఉద్దేశించిన విస్తృత పునర్వ్యవస్థీకరణలో ఈ తొలగింపులు భాగం. తమ కస్టమర్ సంస్థలకు ఏఐ ద్వారా మెరుగైన సేవలు అందించి మార్కెట్ వృద్ధిని పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.తొలగింపుల నిర్ణయాన్ని కంపెనీ గ్లోబల్ సేల్స్ అండ్ కస్టమర్ ఆపరేషన్స్ ప్రెసిడెంట్ బిల్ స్కానెల్, గ్లోబల్ ఛానెల్స్ ప్రెసిడెంట్ జాన్ బైర్న్ మెమో ద్వారా తెలియజేశారు. ఉద్యోగుల తొలగింపులు బాధాకరమే అయినప్పటికీ భవిష్యత్ వృద్ధి కోసం అనివార్యమైనట్లు పేర్కొన్నారు. తొలగింపుల గురించి ఉద్యోగులకు హెచ్ఆర్ ఎగ్జిట్ మీటింగ్‌ల ద్వారా తెలియజేశారు.కొందరికి వన్-ఆన్-వన్ మీటింగ్‌ల ద్వారా ఈ విషయం తెలిసింది. బాధిత ఉద్యోగులకు రెండు నెలల వేతనాలతో పాటు సంవత్సరానికి అదనంగా ఒక వారం, గరిష్టంగా 26 వారాల వరకు సీవెరన్స్ ప్యాకేజీలు అందిస్తున్నారు. అయితే ప్రోత్సాహకాలు, స్టాక్ ఆప్షన్లు కోల్పోవడంపై దీర్ఘకాలిక ఉద్యోగులలో అసంతృప్తి ఉంది. ఇటీవలి బడ్జెట్ తగ్గింపులు, రద్దైన ప్రాజెక్ట్‌లను గమనించిన కొంతమంది ఉద్యోగులు కోతలను ముందే ఊహించారు.డెల్ ఇప్పటికే 2023 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 13,000 మంది ఉద్యోగులను తొలగించింది. రిమోట్-వర్క్ విధానాన్ని రద్దు చేస్తూ, గత సంవత్సరం ఉద్యోగులను తిరిగి ఆఫీస్‌లకు పిలవాలని కంపెనీ తీసుకున్న నిర్ణయం కూడా సిబ్బందిని తగ్గించడంలో భాగంగా తీసుకున్న చర్యగా భావిస్తున్నారు. ప్రస్తుత తొలగింపులతో డెల్ వర్క్‌ఫోర్స్ 1.2 లక్షల నుంచి 1లక్ష దిగువకు తగ్గుతుందని అంచనా. -
15 వేల మంది తొలగింపు ప్రకటన.. షేర్లు భారీ పతనం
ప్రముఖ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ ఇంటెల్ కార్పోరేషన్ భారీగా నష్టపోయింది. భారీ వృద్ధి అంచనాతో 15,000 ఉద్యోగాలను తగ్గించే ప్రణాళికను ప్రకటించిన మరుసటి రోజే ఆ కంపెనీ షేర్లు 40 సంవత్సరాలలో అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి.శుక్రవారం న్యూయార్క్‌లో ట్రేడింగ్ ప్రారంభించిన తర్వాత షేర్లు 26% పైగా పడిపోయాయి. కంపెనీ మార్కెట్ విలువలో సుమారు 32 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. బ్లూమ్‌బెర్గ్ సంకలనం చేసిన డేటా ప్రకారం, కనీసం 1982 నుంచి కంపెనీ స్టాక్ అతిపెద్ద ఇంట్రాడే పతనాన్ని ఇది సూచిస్తోంది.ప్రస్తుత త్రైమాసికంలో అమ్మకాలు 12.5 బిలియన్ డాలర్ల నుంచి 13.5 బిలియన్ డాలర్లుగా ఉంటాయని కంపెనీ గురువారం తెలిపింది. బ్లూమ్‌బెర్గ్ సంకలనం చేసిన డేటా ప్రకారం విశ్లేషకులు సగటున 14.38 బిలియన్ డాలర్లు అంచనా వేశారు. కానీ ఇంటెల్ ఒక్కో షేరు 3 సెంట్ల చొప్పున నష్టపోయాయి. ఇంటెల్ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,10,000 మంది ఉద్యోగులు ఉండగా 15% మందికిపైగా తగ్గించాలని యోచిస్తున్నట్లు ఇంటెల్ తాజాగా తెలిపింది. -
ఒక్క నెలలో ఇంత మంది టెకీల తొలగింపా?
ఐటీ రంగంలో పరిస్థితులు ఇంకా మెరుగైనట్లు కనిపించడం లేదు. లేఆఫ్‌ల భయం ఉద్యోగులను ఇంకా వీడలేదు. గడిచిన జూలై నెలలో ప్రపంచవ్యాప్తంగా పలు ఐటీ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగించాయి. భారత్‌లోనూ గణనీయ సంఖ్యలో ఐటీ ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు.ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపులు జూలై నెలలోనూ కొనసాగాయి. విదేశాలలోపాటు, భారత్‌లోనూ పలు కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నాయి. గత నెలలో మొత్తంగా దాదాపు 8000 మంది ఉద్యోగాలు కోల్పోగా భారత్‌లో 600 మంది ఉద్వాసనకు గురయ్యారు. జూన్‌తో పోలిస్తే ఉద్యోగుల తొలగింపుల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ, ప్రభావం గణనీయంగానే ఉంది.జూలైలో ప్రధాన తొలగింపులు ఇవేమసాచుసెట్స్కు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ యూకేజీ (UKG) తన వర్క్‌ఫోర్స్‌లో 14% మందిని తొలగించింది. మొత్తం 2,200 మంది ఇంటి బాట పట్టారు. కాలిఫోర్నియాకు చెందిన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ట్యూట్ (Intuit Inc.) కార్యకలాపాల క్రమబద్ధీకరణ పేరుతో దాదాపు 10% మంది అంటే 1,800 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది.సాఫ్ట్వేర్ కంపెనీలు ఓపెన్ టెక్స్ట్, రెడ్బాక్స్ కూడా ఉద్యోగుల తొలగింపులను ప్రకటించాయి. అవి వరుసగా 1,200, 100 ఉద్యోగాలను తగ్గించాయి. భారతీయ ఎడ్టెక్ దిగ్గజం అన్కాడెమీ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా 100 మంది మార్కెటింగ్, బిజినెస్, ప్రొడక్షన్ ఉద్యోగులను, 150 మంది సేల్స్ సిబ్బందిని మొత్తంగా 250 మందిని తొలగించింది.చెన్నైకి చెందిన అగ్రిటెక్ సంస్థ వేకూల్ 200 మందికి పైగా ఉద్యోగులను తొలగించగా బెంగళూరు ఆధారిత ఆడియో సిరీస్ ప్లాట్‌ఫారమ్ పాకెట్ఎఫ్ఎం దాదాపు 200 మంది రైటర్లను తొలగించింది. ఇక ‘ఎక్స్’కి పోటీగా వచ్చిన భారతీయ మైక్రోబ్లాగింగ్ సైట్ ‘కూ’ (Koo) డైలీహంట్తో కొనుగోలు చర్చలు విఫలమవడంతో మూతపడింది. దీంతో దాదాపు 200 మంది ఉద్యోగులపై ప్రభావం పడింది. -
Tech layoffs: దేశీయ ఐటీ నిపుణులకు భారీ డిమాండ్
న్యూఢిల్లీ: అమెరికాలోని బడా టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలతో భారత ఐటీ సంస్థలకు గణనీయంగా లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయని హిటాచీ గ్రూప్‌లో భాగమైన ఐటీ సంస్థ గ్లోబల్‌లాజిక్ ప్రెసిడెంట్ నితేష్ బంగా అభిప్రాయపడ్డారు. ఈ పరిణామంతో అమెరికా నుంచి భారత సంస్థలకు బోలెడంత పని బదిలీ కావచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తమ సంస్థ భారత్‌లో ఉద్యోగులను నియమించుకోవడంపై దృష్టి పెడుతోందని, ఏటా సిబ్బంది సంఖ్యను 25 నుంచి 35 శాతం మేర పెంచుకోవాలని భావిస్తోందని బంగా పేర్కొన్నారు. ‘గూగుల్, ట్విటర్ లేదా ఫేస్బుక్ లేదా ఇతరత్రా అమెరికాలోని ఏ కంపెనీ అయినా ఉద్యోగులను తొలగిస్తున్నాయంటే, అవి పనులను నిలిపివేయాలని అనుకుంటున్నట్లుగా భావించరాదు. ఆయా కంపెనీలు ఇప్పటికీ తమ కార్యకలాపాలను కొనసాగించాల్సే ఉంటుంది. అందుకోసం నిపుణుల అవసరమూ ఉంటుంది. కాబట్టి అమెరికా నుంచి బోలెడంత పని భారత్‌కు రావచ్చు. (ఫ్లాగ్‌స్టార్ చేతికి సిగ్నేచర్ బ్యాంక్ డీల్ విలువ రూ. 22,300 కోట్లు ) అయితే, ఆయా సంస్థలు తమ ఖర్చుల విషయంలో బేరీజు వేసుకుని, తగు నిర్ణయం తీసుకుంటాయి‘ అని ఆయన తెలిపారు. తాము ప్రతి నెలా 1,000 మంది వరకూ రిక్రూట్ చేసుకుంటామని, వీరిలో 50 శాతం మంది భారత్‌లో ఉంటారని బంగా చెప్పారు. ఏటా ఈ సంఖ్య 25-35 శాతం మేర పెరుగుతోందన్నారు. గ్లోబల్‌లాజిక్ ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసుల్లో 2-3 ఏళ్ల అనుభవమున్న ఇంజినీర్లను రిక్రూట్ చేసుకుని, తమ కార్యకలాపాలకు అవసరమైన విధంగా వారికి డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణనిస్తోంది. ప్రస్తుతం కంపెనీకి భారత్‌లో 15,000 మంది వరకూ సిబ్బంది ఉన్నారు. ఇది అంతర్జాతీయంగా గ్లోబల్‌లాజిక్‌కు ఉన్న సిబ్బందిలో సగం. (EPFO: పీఎఫ్ విత్ డ్రా చేస్తున్నారా? ఈ సందర్భంలో 75 శాతం తీసుకోవచ్చు.. పెళ్లి కోసం కూడా!) -
లేఆఫ్స్‌పై లేబర్ కోర్టును ఆశ్రయించిన టెకీలు
సాక్షి, బెంగుళూరు: టెక్ మహీంద్రలో ఉద్యోగుల తొలగింపుకు సంబంధించిన వివాదాల పరిష్కారంలో మహారాష్ట్ర కార్మిక శాఖ విఫలం కావడంతో ఐటీ ఉద్యోగుల ఫోరం 11 వివాదాలకు సంబంధించి లేబర్ కోర్టును ఆశ్రయించినట్టు వెల్లడించింది. బాధిత ఉద్యోగులు పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 2 ఏ కింద పిటిషన్లు వేశారని ఫోరం కో-ఆర్డినేటర్ ఇలవరసన్ రాజా తెలిపారు. ఈ సెక్షన్ ప్రకారం ఏ ఉద్యోగినైనా సంస్థ తొలగించిన పక్షంలో దాన్ని పారిశ్రామిక వివాదంగా పరిగణిస్తారు. కాగా దీనిపై స్పందించిన టెక్ మహీంద్ర న్యాయస్థాన పరిధిలో ఉన్న అంశాలపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని పేర్కొంది. గతంలో ఓ ఉద్యోగిని బలవంతంగా తొలగించేలా కంపెనీ హెచ్ఆర్ అధికారులు వ్యవహరించిన ఆడియో క్లిప్‌లు వెలుగు చూడటంతో మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా క్షమాపణలు వేడుకున్న విషయం తెలిసిందే. పలు ఐటీ కంపెనీలు ఇటీవల ఉద్యోగులను పెద్దసంఖ్యలో తొలగిస్తున్నాయి. విప్రో, కాగ్నిజెంట్ సహా పలు ఐటీ కంపెనీలు సామర్థ్య మదింపు పేరుతో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. -
లేఆఫ్స్‌పై ఇన్ఫీ మాజీ సీఎఫ్ఓ ఏమన్నారంటే..
హైదరాబాద్ : ఉద్యోగాల కల్పనకు ప్రధాన రంగంగా చెప్పుకునే ఐటీ రంగంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని, ప్రస్తుతం ఐటీ పరిశ్రమ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందని ఇప్పటికే పలు రిపోర్టులు హెచ్చరిస్తూ వస్తున్నాయి. ఐటీ పరిశ్రమపై ఆశలు వదులుకునేలా ఈ రిపోర్టులు ప్రతిబింబిస్తున్నాయి. అంతేకాక కంపెనీల్లో ఇప్పటికే పనిచేస్తున్న వారి పరిస్థితులపై కూడా ఆందోళనకరంగా ఉన్నట్టు పేర్కొంటున్నాయి. లేఆఫ్స్ బెడద విపరీతంగా ఉన్నట్టు తెలుపుతున్నాయి. అయితే ఈ రిపోర్టులన్నింటిన్నీ దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ, ఐటీ రంగ నిపుణుడు టీవీ మోహన్‌దాస్ పాయ్ ఖండించారు. లేఆఫ్స్‌పై వస్తున్న రిపోర్టులన్నీ నిరాధారనమైనవిగా పేర్కొన్నారు. ఉన్నవి లేనివి కల్పించి చూపిస్తున్నట్టు తెలిపారు. లేఆఫ్స్‌పై వస్తున్న ముందస్తు రిపోర్టులు పూర్తిగా అతిశయోక్తి కలిగించేలా, భయాందోళనలను రేకెత్తించేలా ఉన్నాయని చెప్పారు. '' అవును కొంత మంది చాలా భయాందోళనతో ఉన్నారు. అది కూడా మీడియా హైప్ వల్లే. కానీ ఇక్కడ భయాందోళన చెందడానికి ఏం లేదు. భారీమొత్తంలో లేఆఫ్స్ అనేవే లేవు'' అని పాయ్ చెప్పారు. మోహన్ దాస్ పాయ్ ఒకప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీకి మానవ వనరుల విభాగానికి అధినేతగా పనిచేశారు. ఉద్యోగాల అభద్రతాభావంతో చాలా మంది ఐటీ నిపుణుల్లో మానసిక ఆరోగ్యం క్షీణిస్తుందని గతంలో పలురిపోర్టులు వచ్చాయి. భయాందోళన, ఒత్తిడి వాతావరణాన్ని వారు ఎదుర్కొంటున్నారని చెప్పాయి. అంతేకాక వచ్చే మూడేళ్లలో దాదాపు ఆరులక్షల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారని కూడా రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ రిపోర్టులన్నింటిన్నీ పాయ్ కొట్టిపారేశారు. ఇవి పూర్తిగా చెత్త రిపోర్టులని, అంతేకాక పూర్తిగా అవాస్తమైనవిగా పాయ్ వర్ణించారు. '' ఇప్పటికే ఒక క్వార్టర్ అయిపోయింది. రెండో క్వార్టర్ మధ్యలో ఉన్నాం. రెండు అతిపెద్ద టెక్ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు ఫలితాలను ప్రకటించాయి. వీటిలో ఎలాంటి లేఆఫ్స్‌ను కంపెనీలు ప్రకటించలేదు'' అని పాయ్ వివరించారు. ఈ కంపెనీల్లో యుటిలైజేషన్ రేట్లు కూడా చారిత్రాత్మక గరిష్టాలను నమోదుచేశాయన్నారు. -
ఇలా చేస్తే ఉద్యోగాల కోతకు చెక్
బెంగళూరు : దేశీయ ఐటీ పరిశ్రమ ఇటీవల ఉద్యోగాల కోతతో తీవ్రంగా సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ట్రంప్ వీసా విధానాలు, ఆటోమేషన్, వ్యయాల భారం వంటి కారణాలతో ఉద్యోగులపై కంపెనీలు వేటు వేస్తున్నాయి. అయితే ఉద్యోగులపై వేటు వేయకుండా.. ఈ గడ్డు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఐటీ కంపెనీలకు ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఓ సలహా ఇచ్చారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ లకు చెల్లించే వేతనాల్లో కోతపెడితే, యువతరం ఉద్యోగులను కాపాడవచ్చని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి చెప్పారు. భారతీయ ఐటీ పరిశ్రమ ఇలాంటి గడ్డుపరిస్థితులను ఎదుర్కొనడం ఇదేమీ కొత్త కాదని, గతంలో కూడా ఇలాంటి పరిస్థితులనే ఐటీ పరిశ్రమ చాలాసార్లు ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. పరిశ్రమ నాయకులందరూ కలిసి మంచి ఉద్దేశ్యంతో ఈ సమస్యను పరిష్కరిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని ఆశాభావం వ్యక్తంచేశారు. '' ఇండస్ట్రీలో చాలామంది తెలివైన నాయకులున్నారు. వారందరికీ మంచి ఉద్డేశ్యాలే ఉన్నాయి. వారు పరిష్కారం కనుగొంటారు'' అని ఉద్యోగాల కోతపై ఓ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఉద్యోగుల తొలగింపు సమస్యను ఎదుర్కోవడం ఇదేమీ తొలిసారి కాదని, 2008, 2001లో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయని పేర్కొన్నారు. దీనిపై తీవ్రంగా ఆందోళన చెందాల్సినవసరం లేదని, ఇలాంటి సమస్యలకు మన దగ్గర పరిష్కారం ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగానే లేఆఫ్స్ సమస్యను ఎలా పరిష్కరించాలో కూడా ఓ ఉదాహరణతో వివరించారు. సీనియర్ యాజమాన్యం స్థాయి ఎగ్జిక్యూటివ్ లు వేతనాలు తగ్గిస్తే, యువతరం ఉద్యోగులను కాపాడవచ్చని సూచించారు. 2001లో ఇన్ఫోసిస్ ఇదే పద్ధతిని అవలంభించిందని తెలిపారు. 2001లో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో యువతరం ఉద్యోగాలను కాపాడేందుకు తమ వేతనాల్లో కొంత త్యాగం చేశామని చెప్పారు. సీనియర్ మేనేజ్ మెంట్ స్థాయిలో అందరం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉద్యోగుల తొలగింపుపై మానవీయ కోణంలో వ్యవహరించాలని సూచించారు. అదేవిధంగా యువ ఉద్యోగులకు శిక్షణ శిబిరాలను నిర్వహించి.. నేర్చుకోవడానికి సమయం ఇవ్వాలని చెప్పారు. అంతేతప్ప ఉద్యోగులను భయపెట్టడం మంచివిధానం కాదన్నారు. -
ఉద్యోగాల కోతపై ఇన్ఫీ మూర్తి స్పందన
బెంగళూరు: ఐటీ రంగంలో భారీ ఉద్యోగాల కోతపై ఇన్ఫోసిస్ ఫౌండర్ ఛైర్మన్ నారాయణ మూర్తి స్పందించారు. ప్రధాన ఐటీ కంపెనీలు తమ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకోవడంపై ఆయన శుక్రవారం స్పదించారు. తమ ఖర్చులను తగ్గించుకునే వ్యూహంలో భాగంగా ఉద్యోగులపై వేటు వేయడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇటీవలి ఐటీ ఉద్యోగుల తీసివేతలపై పీటీఐ ఈ మెయిల్‌కు స్పందించిన ఆయన ఉద్యోగులను తొలగించడం విచారకరమని సమాధానం ఇచ్చారు. అయితే ఇంతకుమించి ఆయన తన అభిప్రాయ వివరాలు వివరించలేదు. కాగా ఆటోమేషన్, ట్రంప్ కొత్త హెచ్1 బీ వీసా కొత్త నిబంధనల నేపథ్యంలో ఐటీ రంగం సంక్షోభంలో చిక్కుకుంది. ఉద్యోగులను తొలగించనున్న ఇన్ఫోసిస్ ప్రకటించింది. సవాలుగా ఉన్న వ్యాపార పర్యావరణంలో ద్వి వార్షిక పనితీరు సమీక్షను నిర్వహిస్తున్నందున, వందలాది మంది మధ్యస్థ , సీనియర్-స్థాయి ఉద్యోగులకు పింక్ స్లిప్స్ అందిస్తున్నట్టు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఇదే బాటలో విప్రో కూడా పయనించింది. తన వార్షిక "పనితీరు అంచనా" లో భాగంగా 600 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు వెల్లడించింది. అయితే, కాగ్నిజెంట్ మాత్రం ఉద్యోగుల తొలగింపుల వార్తలను ఖండించిన సంగతి తెలిసిందే.