లేఆఫ్స్‌పై ఇన్ఫీ మాజీ సీఎఫ్‌ఓ ఏమన్నారంటే..
లేఆఫ్స్‌పై ఇన్ఫీ మాజీ సీఎఫ్‌ఓ ఏమన్నారంటే..
Published Tue, Jul 18 2017 4:40 PM | Last Updated on Tue, Sep 5 2017 4:19 PM
హైదరాబాద్ : ఉద్యోగాల కల్పనకు ప్రధాన రంగంగా చెప్పుకునే ఐటీ రంగంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయని, ప్రస్తుతం ఐటీ పరిశ్రమ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుందని ఇప్పటికే పలు రిపోర్టులు హెచ్చరిస్తూ వస్తున్నాయి. ఐటీ పరిశ్రమపై ఆశలు వదులుకునేలా ఈ రిపోర్టులు ప్రతిబింబిస్తున్నాయి. అంతేకాక కంపెనీల్లో ఇప్పటికే పనిచేస్తున్న వారి పరిస్థితులపై కూడా ఆందోళనకరంగా ఉన్నట్టు పేర్కొంటున్నాయి. లేఆఫ్స్ బెడద విపరీతంగా ఉన్నట్టు తెలుపుతున్నాయి. అయితే ఈ రిపోర్టులన్నింటిన్నీ దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ, ఐటీ రంగ నిపుణుడు టీవీ మోహన్‌దాస్ పాయ్ ఖండించారు. లేఆఫ్స్‌పై వస్తున్న రిపోర్టులన్నీ నిరాధారనమైనవిగా పేర్కొన్నారు. ఉన్నవి లేనివి కల్పించి చూపిస్తున్నట్టు తెలిపారు. లేఆఫ్స్‌పై వస్తున్న ముందస్తు రిపోర్టులు పూర్తిగా అతిశయోక్తి కలిగించేలా, భయాందోళనలను రేకెత్తించేలా ఉన్నాయని చెప్పారు. '' అవును కొంత మంది చాలా భయాందోళనతో ఉన్నారు. అది కూడా మీడియా హైప్ వల్లే. కానీ ఇక్కడ భయాందోళన చెందడానికి ఏం లేదు. భారీమొత్తంలో లేఆఫ్స్ అనేవే లేవు'' అని పాయ్ చెప్పారు.
మోహన్ దాస్ పాయ్ ఒకప్పుడు ఇన్ఫోసిస్ కంపెనీకి మానవ వనరుల విభాగానికి అధినేతగా పనిచేశారు. ఉద్యోగాల అభద్రతాభావంతో చాలా మంది ఐటీ నిపుణుల్లో మానసిక ఆరోగ్యం క్షీణిస్తుందని గతంలో పలురిపోర్టులు వచ్చాయి. భయాందోళన, ఒత్తిడి వాతావరణాన్ని వారు ఎదుర్కొంటున్నారని చెప్పాయి. అంతేకాక వచ్చే మూడేళ్లలో దాదాపు ఆరులక్షల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారని కూడా రిపోర్టులు పేర్కొన్నాయి. ఈ రిపోర్టులన్నింటిన్నీ పాయ్ కొట్టిపారేశారు. ఇవి పూర్తిగా చెత్త రిపోర్టులని, అంతేకాక పూర్తిగా అవాస్తమైనవిగా పాయ్ వర్ణించారు. '' ఇప్పటికే ఒక క్వార్టర్ అయిపోయింది. రెండో క్వార్టర్ మధ్యలో ఉన్నాం. రెండు అతిపెద్ద టెక్ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు ఫలితాలను ప్రకటించాయి. వీటిలో ఎలాంటి లేఆఫ్స్‌ను కంపెనీలు ప్రకటించలేదు'' అని పాయ్ వివరించారు. ఈ కంపెనీల్లో యుటిలైజేషన్ రేట్లు కూడా చారిత్రాత్మక గరిష్టాలను నమోదుచేశాయన్నారు.
Advertisement
Advertisement