దుమ్మురేపుతున్న హీరో కూతురి ఫొటోలు! | Saif daughter Sara Ali Khan photos viral | Sakshi
Sakshi News home page

దుమ్మురేపుతున్న హీరో కూతురి ఫొటోలు!

Published Thu, Sep 22 2016 5:13 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

దుమ్మురేపుతున్న హీరో కూతురి ఫొటోలు!

దుమ్మురేపుతున్న హీరో కూతురి ఫొటోలు!

త్వరలో అమ్మ కాబోతున్న బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ పుట్టినరోజు వేడుక బుధవారం ఘనంగా జరిగింది. 36వ వసంతంలోకి అడుగుపెట్టిన ఆమె సన్నిహిత బంధుమిత్రుల సమక్షంలో బర్త్‌ డే సంబరాలు జరుపుకొన్నారు. ఈ వేడుకలో భర్త సైఫ్‌ అలీఖాన్‌తోపాటు సోదరి కరిష్మా కపూర్‌, సోదరుడు రణ్‌బీర్‌ కపూర్‌ తోపాటు కపూర్‌, ఖాన్‌ పరివారానికి చెందిన ప్రముఖులు చాలామంది హాజరయ్యారు.

ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్న ఈ వేడకలో సైఫ్‌ అలీఖాన్‌- ఆయన మొదటి భార్య కూతురు సారా అలీఖాన్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌ గా నిలిచింది. త్వరలో కరణ్‌ జోహర్‌ తెరకెక్కిస్తున్న 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2' సినిమాలో టైగర్‌ ష్రఫ్‌కు జోడీగా సారా బాలీవుడ్‌లో అరంగేట్రం చేయబోతున్నట్టు కథనాలు వస్తున్నాయి. ప్రముఖ క్రికెటర్‌ పటౌడీ అలీఖాన్‌ మనవరాలు అయిన సారా అలీఖాన్‌ సినీ ప్రవేశం గురించి చాలా కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో పిన్ని కరీనా జన్మదిన వేడుకలో కనిపించిన ఆమె హాట్‌ ఫొటోలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇక, కరీనా జన్మదిన వేడుకలో అమృత అరోరా, మలైకా ఆరోరా, రణ్‌ధీర్‌ కపూర్‌, అమన్‌ జైన్‌, కరణ్‌ కపూర్‌ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement