చౌహాన్ సూపర్: సల్మాన్‌ఖాన్ | Salman Khan all praise for CM Shivraj Singh Chouhan | Sakshi
Sakshi News home page

చౌహాన్ సూపర్: సల్మాన్‌ఖాన్

Published Mon, Jan 13 2014 12:39 PM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM

చౌహాన్ సూపర్: సల్మాన్‌ఖాన్

చౌహాన్ సూపర్: సల్మాన్‌ఖాన్

ఇండోర్: బీజేపీ నేత, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్పై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్ ప్రశంసలు కురింపించాడు. మంచి పనులు చేయడం వల్లే చౌహాన్ను మధ్యప్రజలు మూడోసారి గెలిపించారని పేర్కొన్నారు. దశాబద్ద కాలంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని, ఈ ఘనత చౌహాన్కే దక్కుతుందని తెలిపారు.

తాను ఏ రాజకీయ పార్టీని సమర్థించడం లేదని, ప్రజలకు మంచి చేసిన వారికి తన మద్దతు ఉంటుందన్నారు. ఆదివారం ఇండోర్ వచ్చిన సల్మాన్ తన తల్లికి పురుడు కోసిన మంత్రాసాని రుక్మణీ రాయ్ను కలిశారు. కొన్ని దశాబ్దాల తర్వాత ఆమెను కలవడం ఆనందంగా ఉందన్నారు. మరోవైపు సల్మాన్ఖాన్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement