ఆటో, ఎనర్జీ స్టాక్స్తో పుంజుకున్నాయ్!
Published Tue, Jan 10 2017 9:46 AM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM
ఆటో, ఎనర్జీ స్టాక్స్ మద్దతుతో స్టాక్ మార్కెట్లు మంగళవారం మంచి లాభాల్లో ఎంట్రీ ఇచ్చాయి. 100 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 90.09 పాయింట్ల లాభంలో 26,816 వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా నిఫ్టీ సైతం 30.95 పాయింట్ల లాభంలో 8,267గా నమోదవుతోంది. నేటి మార్కెట్లో ఆటో, ఎనర్జీ స్టాక్స్ ఎక్కువగా లాభపడుతున్నాయి. నిఫ్టీ ఆటో, ఎనర్జీ సబ్-ఇండెక్స్లు 0.74 శాతం, 0.80శాతం పెరిగాయి. అన్నీ నిఫ్టీ స్టాక్స్లో బీపీసీఎల్ టాప్ గెయినర్గా లాభాలు పండిస్తోంది. ఈ స్టాక్స్ 2.44 శాతం పెరిగాయి. టాటా మోటార్స్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్ డీవీఆర్, ఐసీఐసీఐ బ్యాంకులు కూడా 1-2 శాతం మధ్యలో పెరిగాయి.
ఐటీ స్టాక్స్లో నెలకొన్న ఒత్తిడితో పాటు డిసెంబర్ నెల క్వార్టర్ ఫలితాల నేపథ్యంతో సోమవారం ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో నిన్న మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆటో, ఎనర్జీ స్టాక్స్ మద్దతు వల్ల నేడు మార్కెట్లు తిరిగి పుంజుకున్నాయి. అటు డాలర్తో రూపాయి మారకం విలువ కూడా బలంగానే ప్రారంభమైంది. 68.08గా ఎంట్రీ ఇచ్చింది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 176 రూపాయల లాభంతో 28,063గా నమోదవుతోంది.
Advertisement