ప్రజా సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేయడంపై తాను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ చెప్పారు.
హైదరాబాద్: ప్రజా సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేయడంపై తాను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ చెప్పారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నిరసన తెలిపే హక్కును అణిచివేయడం అప్రజాస్వామికమని అన్నారు.
వరంగల్ ఎన్కౌంటర్పై నిరసనగా చలో అసెంబ్లీకి ప్రజా సంఘాల నేతలు పిలపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ ఎన్కౌంటర్పై అసెంబ్లీలో చర్చ జరపాలని ఆయన కోరారు. అరెస్ట్ చేసిన ప్రజాసంఘాల నేతలను తక్షణమే విడుదల చేయాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.