
షరీఫ్ ‘కశ్మీర్’ వ్యాఖ్యలపై భారత్ ధ్వజం
కశ్మీర్‌ను సైన్యరహితం చేయాలన్న పాక్ ప్రధాని షరీఫ్ డిమాండ్‌ను భారత్ గురువారం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.
యునెటైడ్ నేషన్స్: కశ్మీర్‌ను సైన్యరహితం చేయాలన్న పాక్ ప్రధాని షరీఫ్ డిమాండ్‌ను భారత్ గురువారం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. పాకిస్తానే తన దేశాన్ని ఉగ్రవాదరహిత ప్రాంతంగా తీర్చిదిద్దుకోవాలని హితవు పలికింది. అలాగే పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను వీలైనంత త్వరగా ఖాళీ చేయాలని సూచించింది. స్వీయ విధానాల ఫలితంగానే పాక్ ఉగ్రవాద బాధిత దేశంగా మారిందని విదేశాంగశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్విటర్‌లో విమర్శించారు. విదేశీ దురాక్రమణదారులు పాలస్తీనియన్లు, కశ్మీరీలను అణగదొక్కుతున్నారన్న షరీఫ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. పాక్ చర్యల ఫలితం పొరుగు దేశాలను దాటి విస్తరిస్తుండటం యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోందని ఐరాసలో భారత శాశ్వత మిషన్ సెక్రటరీ అభిషేక్ సింగ్ విమర్శించారు.