సికింద్రాబాద్: ఎంఎంటీఎస్ రైళ్లతోపాటు, తెలంగాణ జిల్లాల పరిధిలో ప్రయాణించే రైళ్లలో మహిళలకు మరింత రక్షణ కల్పించడం కోసం గవర్నమెంట్ రైల్వే (జీఆర్‌పీ) పోలీసులు ‘షీ’ టీములను ఏర్పాటు చేశారు. గురువారం నుంచి ఐదు షీ టీమ్‌లను రంగంలోకి దింపినట్టు జీఆర్‌పీ సికింద్రాబాద్ జిల్లా ఎస్పీ ఎస్‌జే.జనార్ధన్ తెలిపారు. హైదరాబాద్. రంగారెడ్డి జిల్లాల పరిధిలో నడుస్తున్న ఎంఎంటీఎస్ రైళ్లతోపాటు నిజామాబాద్, మహబూబ్‌నగర్, కాజీపేట్ మార్గాల్లో నడిచే అన్ని రైళ్లలో షీ టీములు సంచరిస్తాయని చెప్పారు.
ఒక్కో టీమ్‌లో ముగ్గురేసి మహిళా, పురుష కానిస్టేబుళ్లను మఫ్టీలో ఉంటారని తెలిపారు. బాధిత ప్రయాణికులు, మహిళలు, వికలాంగులు, వృద్ధులు తమకు అవసరమైన సహాయ సహకారాల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 1512 లేదా రైల్వే పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 9440700040 కు కాల్ చేసి సమాచారం అందిస్తే సత్వరమే వారు ప్రయాణిస్తున్న బోగీలోకి షీ టీమ్‌ను పంపించే ఏర్పాట్లు చేస్తామన్నారు.
ఇక తెలంగాణలోని రైళ్లలో ‘షీ టీమ్స్’
Published Fri, Aug 7 2015 12:00 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 AM
Advertisement
Advertisement