ఔను! నిరాయుధులే.. అయితే ఏంటి? | SIMI Men Were Unarmed When Shot, says Anti-Terror Top Cop | Sakshi
Sakshi News home page

ఔను! నిరాయుధులే.. అయితే ఏంటి?

Published Wed, Nov 2 2016 3:54 PM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

ఔను! నిరాయుధులే.. అయితే ఏంటి? - Sakshi

ఔను! నిరాయుధులే.. అయితే ఏంటి?

భోపాల్‌: జైలు నుంచి పరారైన ఎనిమిది మంది సిమీ కార్యకర్తల ఎన్‌కౌంటర్‌ ఉదంతంపై మధ్యప్రదేశ్‌ ఉగ్రవాద నిరోధక దళం చీఫ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరారైన సిమీ కార్యకర్తలు హతమైన సమయంలో వారి వద్ద ఆయుధాలు లేవని, నిరాయుధులైన వారిని పోలీసులు కాల్చిచంపారని ఆయన పేర్కొన్నారు. ‘పోలీసులు ఎప్పుడు ఆయుధాలను ఉపయోగించి ప్రాణాలు తీసుకోవాలో చట్టంలో ఉన్నది. వీరు కరుడుగట్టిన నేరస్తులు. ఇలాంటి వ్యక్తులు పరారైనప్పుడు పోలీసులు గరిష్ఠమైన శక్తిని ఉపయోగించాల్సి ఉంటుంది’ అని ఏటీఎస్‌ చీఫ్‌ సంజీవ్‌ షమీ పేర్కొన్నారు.

అయితే, పరారైన సిమీ కార్యకర్తలు మొదట కాల్పులు జరపడంతో తాము ఎదురుకాల్పుల్లో జరిపామని, ఈ ఎదురుకాల్పుల్లోనే వారు హతమయ్యారని పోలీసులు చెప్తుండగా.. వారి వాదనను విభేదిస్తూ షమీ వ్యాఖ్యలు చేశారు. రెండురోజుల కిందట సిమీ కార్యకర్తలు పోలీసుల చేతిలో చనిపోయిన విషయాన్ని మొదట ప్రకటించింది తానేనని, కాబట్టి ఈ ఘటన గురించి పూర్తిగా తెలుసునని షమీ తెలిపారు. సిమీ కార్యకర్తల వద్ద ఆయుధాలు లేవని విషయంలో తన వాదనకు కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు.
 
కాగా, భోపాల్‌ సెంట్రల్‌ జైలు నుంచి తప్పించుకొని.. ఆ తర్వాత హతమైన ఎనిమిది మంది సిమీ కార్యకర్తల ఎన్‌కౌంటర్‌ ఘటనపై పలు ఆరోపణలు వస్తుండటంతో జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్చార్సీ) స్పందించింది. వీరి ఎన్‌కౌంటర్‌ ఘటనపై వివరణ ఇవ్వాలని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వాన్ని, పోలీసులను ఎన్‌హెచ్చార్సీ ఆదేశించింది.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement