
శ్రీశైల జలాశయ నీటిమట్టం: 802.70 అడుగులు
కర్నూలు(శ్రీశైలం): శ్రీశైల జలాశయ నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 802.70 అడుగులుకు చేరింది. జలాశయ పరిసర ప్రాంతాలలో 15 మి.మీటర్ల వర్షపాతం కురిసినప్పటికీ పగటివేళల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల 65 క్యూసెక్కుల నీరు ఆవిరి అయినట్లు గేజింగ్ సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 30.3154 టీఎంసీల నీరు ఉంది.