ఆ కండీషన్ నెరవేరుస్తేనే నటిస్తా: అగ్ర హీరో
బాలీవుడ్ అగ్రహీరో హృతిక్ రోషన్ ఇప్పుడు ఫుల్ ఖుషీగా ఉన్నాడు. హిట్ కోసం చకోరపక్షిలా ఎదురుచూస్తున్న తరుణంలో అతని తాజా సినిమా ’కాబిల్’ సూపర్‌హిట్ కావడంతో హృతిక్‌లో ఆనందాన్నింపింది. షారుఖ్‌ఖాన్ ’రయీస్’తో పోటీపడి మరీ బాక్సాఫీస్ రేసులో ’కాబిల్’ నెగ్గుకొచ్చింది. ఈ నేపథ్యంలో పలువురు దర్శకులు కొత్త కథలతో హృతిక్ కోసం క్యూ కడుతున్నట్టు తెలుస్తోంది. ఈ జాబితాలో సల్మాన్‌ఖాన్ ఫేవరెట్ దర్శకుడు, ’బజరంరీ భాయ్‌జాన్’రూపకర్త కబీర్ ఖాన్ కూడా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం సల్మాన్‌తో ’ట్యూబ్‌లైట్’ సినిమా చేస్తున్న కబీర్ ఈ మధ్య హృతిక్‌కు ఓ కొత్త కథ వినిపించాడట.
ఈ కథ హృతిక్‌కు నచ్చినప్పటికీ.. ఈ సినిమాలో నటించడానికి ఆయన ఒక షరతు పెట్టినట్టు తెలిసింది. ఈ సినిమాలో తనకు జోడీగా కత్రినా కైఫ్‌ను తీసుకోవాలంటూ హృతిక్ కరాఖండిగా చెప్పాడట. అయితే, ఈ సినిమాలో హృతిక్‌కు జోడీగా కత్రిన సరిపోదని కబీర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం దీపికా పదుకొణే, కృతి సనన్‌లను అడిగినట్టు గతంలో కథనాలు వచ్చాయి. అయితే, కబీర్ కొత్త అమ్మాయిని ఈ సినిమాకు కథానాయికగా తీసుకోవాలని భావిస్తున్నట్టు చెప్తున్నారు. హృతిక్ మాత్రం ’బ్యాంగ్ బ్యాంగ్’లో తనతో జత కట్టిన కత్రిన వైపే మొగ్గుచూపుతున్నారని సమాచారం.