ఎస్‌బీహెచ్ లాభం రూ. 119 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిసెంబర్ త్రైమాసికంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ఎస్‌బీహెచ్) నికర లాభం ఏకంగా 63% క్షీణించి రూ. 119 కోట్లకు పరిమితమైంది. ఉద్యోగులపై వ్యయాలు భారీగా పెరగడం తదితర అంశాలు ఇందుకు కారణమయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో ఎస్‌బీహెచ్ నికర లాభం రూ. 322 కోట్లు. కాగా నికర వడ్డీ ఆదాయం 1.28% మేర పెరిగి రూ. 989 కోట్లుగా నమోదైంది. డిపాజిట్లు రూ. 3,972 కోట్లు పెరిగి రూ. 1,22,211 కోట్లకు చేరుకోగా, రుణాలు రూ. 4,784 కోట్లు పెరిగి రూ. 96,955 కోట్లకు చేరుకున్నాయి.
జేకే సిమెంట్ లాభం 79% డౌన్
జేకే సిమెంట్ నికర లాభం 79 శాతం క్షీణించి రూ. 11 కోట్లుగా నమోదైంది. ఆదాయం కూడా రూ. 688 కోట్ల నుంచి రూ. 677 కోట్లకు తగ్గింది.